BigTV English

Rajaiah : బోరున విలపించిన రాజయ్య.. కుట్రలు చేస్తున్నారని ఆవేదన..

Rajaiah : బోరున విలపించిన రాజయ్య.. కుట్రలు చేస్తున్నారని ఆవేదన..

Rajaiah : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ మధ్య మీడియాలో హాట్ న్యూస్ అయ్యారు. ఆయనపై సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆమె నేరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కే ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో రాజయ్య ఈ వివాదాన్ని ముగించేందుకు స్వయంగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. ప్రెస్ మీట్ పశ్చాతాపాన్ని ప్రకటించారు. క్షమాపణలు కోరారు. గ్రామ అభివృద్ధికి 25 లక్షలు నిధులు ప్రకటించారు. అయినా సరే సర్పంచ్ నవ్యలో కోపం చల్లారలేదు. ప్రెస్ మీట్ లోనే ఎమ్మెల్యేను కడిగేశారు. మరోసారి తన జోలికి వస్తే దారుణ పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చరించారు.


ఆ తర్వాత రాజయ్య నవ్య ఇష్యూపై మాట్లాడలేదు. తాజాగా కరుణాపురంలో జరిగి ఫాదర్ కొలంబో జయంతి వేడుకల్లో రాజయ్య పాల్గొన్నారు. ఈ వేడుకలో తన బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. కొందరు రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని అంటూ కంటతడిపెట్టారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

దమ్ముంటే ఫేస్‌ టూ ఫేస్‌ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని రాజయ్య సవాల్ విసిరారు. ఏ సర్వే చూసినా తాను ముందు వరుసలో ఉన్నానని అందుకే కుట్రతో కొందరు ఇబ్బంది పెడుతున్నారని బోరున విలపించారు. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాను ఆడవాళ్లను గౌరవించే వ్యక్తినని తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటా ప్రజల మధ్యనే చస్తానని కొలంబో విగ్రహం సాక్షిగా రాజయ్య ప్రతినబూనారు.


Bandi Sanjay : సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్డితో విచారణ జరపండి: బండి సంజయ్..

Kavitha : కవిత న్యాయపోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్..

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×