BigTV English

Bandi Sanjay : సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్డితో విచారణ జరపండి: బండి సంజయ్..

Bandi Sanjay : సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్డితో విచారణ జరపండి: బండి సంజయ్..

Bandi Sanjay : TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారం తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్త కాదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరించారు.


ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీకేజీని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. అరెస్టు చేసిన బీజేవైఎం నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రశ్నపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని బండి సంజయ్ అన్నారు. అయితే నయీం కేసు, డ్రగ్స్ కేసు ఇలా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని గుర్తు చేశారు. పేపర్ లీకేజీ కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చేందుకే సిట్‌కు అప్పగించిందని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.


Kavitha : కవిత న్యాయపోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్..

Dil Raju: దిల్ ‘రాజు’ రాజకీయ ‘బంటు’నా?.. ఆ హడావుడి అందుకేనా?

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×