BigTV English

Kavitha : కవిత న్యాయపోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్..

Kavitha : కవిత న్యాయపోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్..

Kavitha : ఢిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటం చేస్తున్నారు. ఈడీ ఇచ్చిన నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయంలో విచారణ చేయడాన్ని అభ్యంతరం తెలుపుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత ఆరోపించారు.


ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన మొబైల్‌ ఫోన్లు సీజ్‌ చేశారని సుప్రీంకోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉందన్నారు. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ప్రకటించింది.

మరోవైపు ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత హాజరుకావాల్సి ఉంది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే కవిత పిటిషన్ ను తక్షణమే విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 16న రెండోసారి ఈడీ విచారణకు కవిత పక్కాగా హాజరుకావాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈనెల 11న తొలి విడత విచారణలో ఈడీ కవితను దాదాపు 9 గంటలపాటు ప్రశ్నించింది. అదే రోజు రెండోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.


Dil Raju: దిల్ ‘రాజు’ రాజకీయ ‘బంటు’నా?.. ఆ హడావుడి అందుకేనా?

Bandi Sanjay : సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్డితో విచారణ జరపండి: బండి సంజయ్..

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×