EPAPER

Preethi Health Update : నా కుమార్తె బతుకుతుందని ఆశలేదు.. ప్రీతి తండ్రి ఆవేదన ..

Preethi Health Update : నా కుమార్తె బతుకుతుందని ఆశలేదు.. ప్రీతి తండ్రి ఆవేదన ..

Preethi Health Update : వరంగల్‌ కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోతోందన్నారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని ఆశించినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు.


ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశించామని కానీ, ఆశలు వదిలేసుకున్నామని ప్రీతి తండ్రి స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని బతికే అవకాశాలు లేవని వైద్యులు కూడా చెప్పారని వెల్లడించారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని కోరారు.

మరోవైపు పలువురు రాజకీయ నేతలు నిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎంపీ మాలోతు కవిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసు భద్రత పెంచాలని నిమ్స్ డైరెక్టర్ కోరారు. ఈ నేపథ్యంలో నిమ్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఏ క్షణంలోనైనా నిమ్స్ వైద్యులు ప్రీతి హెల్త్ కండీషన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Naveen Murder Case : నవీన్ హత్య కేసులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా?.. హరిహరకృష్ణ తండ్రి అనుమానాలేంటి..?

Preethi : మెడికో ప్రీతి కన్నుమూత.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు..

Related News

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Big Stories

×