BigTV English

Preethi : మెడికో ప్రీతి కన్నుమూత.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు..

Preethi : మెడికో ప్రీతి కన్నుమూత.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు..

Preethi : హైదరాబాద్ నిమ్స్‌లో ఐదురోజులపాటు మృత్యువుతో పోరాడిన వరంగల్‌ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రీతి కన్నుమూశారు. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో నిమ్స్‌ ఆసుపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం నిమ్స్‌ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు యత్నించగా ఆమె తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. ప్రీతి మృతికి కారణాలేంటో తెలపాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 22 ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టారు. సీనియర్‌ విద్యార్థి సైఫ్ పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రీతి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు.


ప్రీతి మృతి వార్త తెలియడంతో విద్యార్థి సంఘాల నేతలు, బీజేపీ కార్యకర్తలు నిమ్స్‌ ఆసుపత్రికి చేరుకోవడంతో ఆదివారం రాత్రి అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంబులెన్స్‌లో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రీతి బంధువులు, గిరిజన సంఘాలు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌ను తరలించారు. మరోవైపు ప్రీతి తల్లిదండ్రులతో పోలీసులు చర్చించారు. చివరికి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గాంధీ ఆసుపత్రి వద్ద కూడా వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శవపరీక్షకు తమ సమక్షంలో జరగాలని ప్రీతి బంధువులు డిమాండ్‌ చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. శవపరీక్ష పూర్తి అయిన అనంతరం కుటుంబ సభ్యులకు ప్రీతి మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు.


ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. మొత్తం రూ. 30 లక్షల ఆర్థికసాయం అందిస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి గెజిటెడ్‌ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

Naveen Murder Case : నవీన్ హత్య కేసులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా?.. హరిహరకృష్ణ తండ్రి అనుమానాలేంటి..?

Preethi Health Update : నా కుమార్తె బతుకుతుందని ఆశలేదు.. ప్రీతి తండ్రి ఆవేదన ..

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×