Big Stories

Bandi Sanjay: బండి అరెస్టుతో ఢిల్లీకి ఇచ్చిన మెసేజ్ ఏంటి? కవిత కోసమేనా..?

bandi sanjay kavitha

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్ రాజకీయంగా సంచలనంగా మారింది. కేసు చిన్నదే.. అరెస్ట్ మాత్రం పెద్దది. ఎవడో పేపర్ తీసుకెళ్లాడు.. అది చాలామందికి పంపించాడు.. అందులో బండి సంజయ్‌కి కూడా వాట్సాప్ చేశాడు. అంతే, దెబ్బకు అరెస్ట్ చేసి జిల్లాలకు జిల్లాలు తిప్పారు పోలీసులు. అదికూడా అర్థరాత్రి అత్తగారింట్లోంచి బండిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం మరింత కలకలం రేపింది. ఎందుకు? పోలీసుల యాక్షన్ ఇంతలా ఎందుకు? బండి అరెస్ట్ వెనుక రాజకీయ వ్యూహం దాగుందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇంత దారుణంగా అరెస్ట్ చేసి.. ఢిల్లీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందా?

- Advertisement -

కావొచ్చు అంటున్నారు విశ్లేషకులు. మమ్మల్ని టచ్ చేస్తే.. మిమ్మల్ని టచ్ చేస్తాం.. అనేలా బీజేపీకి సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండుసార్లు సుదీర్ఘంగా విచారించింది. అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది కానీ చేయలేదు. నెక్ట్స్ టైమ్ పక్కా అరెస్ట్ అంటున్నారు. కవిత ఎపిసోడ్ అలా కంటిన్యూ అవుతుండగానే.. తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖరన్ మరో పొలిటికల్ బాంబు పేల్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెబితే.. తాను బీఆర్ఎస్ పార్టీకి మూడు విడతల్లో 75 కోట్లు ఇచ్చానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఆఫీసు దగ్గర పార్క్ చేసిఉన్న కారులో ఏపీ అనే వ్యక్తికి తాను డబ్బు ఇచ్చానని అంటున్నారు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని.. వాటిని చూపెడతానని చెబుతున్నారు. సుఖేశ్ ఆరోపణలపై బీఆర్ఎస్ మండిపడింది. ఇదంతా బీజేపీ కుట్ర అని.. అమిత్‌షా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే సుఖేశ్ మాట్లాడాడని విమర్శించింది. త్వరలోనే ఆ కేసూ బయటకు రానుంది.

- Advertisement -

కవిత కేసుతోనే ఖంగుతిన్ని బీఆర్ఎస్‌కు.. సుఖేశ్ ఆరోపణలు మరింత ఇబ్బందిగా మారాయి. ముందుముందు కవిత అరెస్ట్ తప్పదని కూడా తెలుస్తోంది. సుఖేశ్ కేసులో ఎవరిని టార్గెట్ చేస్తారో తెలీదు. ఇలా బీఆర్ఎస్‌ను కేంద్రంలోని బీజేపీ ఫుల్‌గా టార్గెట్ చేస్తుండటంతో.. కారు పార్టీ రివర్స్ గిఫ్ట్ ఇవ్వడం మొదలుపెట్టిందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మాజోలికి వస్తే.. మేము మీజోలికి రావాల్సి ఉంటుందనే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు అర్థం అయ్యేలా చెప్పేందుకే.. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో బండి సంజయ్‌ను అర్థరాత్రి హడావుడిగా అరెస్ట్ చేశారని అంటున్నారు.

గతంలో ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేతలకు ఉచ్చు బిగిద్దామని అనుకున్నారు.. కానీ హైకోర్టు తీర్పుతో అది కుదరడం లేదు. ఆ కేసు కాకపోతే మరోకేసు అన్నట్టు.. ఇప్పుడు బండి సంజయ్‌ను కార్నర్ చేశారని చెబుతున్నారు. ఈ కేసు కోర్టులో నిలుస్తుందా లేదా? శిక్ష పడుతుందా లేదా? అనేది తర్వాతి విషయం. ముందు అరెస్ట్ చేశామా లేదా? బీజేపీని బెదరగొట్టామా లేదా? కమలం పార్టీ కార్యకర్తల్లో అభద్రతాభావం తీసుకొచ్చామా లేదా? అనేదే బీఆర్ఎస్ టార్గెట్‌గా తెలుస్తోంది. మరి, రాష్ట్ర ప్రభుత్వమే ఇంతలా భయపెట్టాలని చూస్తే.. మరి సుప్రీం పవర్స్ ఉండే కేంద్రం ఇలాంటి బెదిరింపులకు బెదురుతుందా? అసలే అక్కడున్నది మోదీ-అమిత్‌షా. వారి వ్యూహాలను కేసీఆర్ ఛేధించగలరా? ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఎలాంటి విపరీతాలకు దారి తీస్తాయి?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News