Big Stories

Kavitha: ఈడీ విచారణకు హాజరైన కవిత.. అరుణ్ పిళ్లైతో కలిసి ప్రశ్నించే అవకాశం..

Kavitha: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా?.. కారా?.. అనే ప్రశ్నకు తెర పడింది. ఎట్టకేలకు రెండో సారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేవలం కవితను మాత్రం ఈడీ ఆఫీస్‌లోకి అనుమతించారు. వెంట వచ్చిన కవిత భర్త అనిల్, న్యాయవాది సోమభరత్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లను లోపలికి అనుమతించ లేదు.

- Advertisement -

ఇక ఆఫీసులోకి వెళ్తున్న క్రమంలో కవిత చిరునవ్వుతో పిడికిలి బిగింది అభిమానులకు అభివాదం చేశారు. ధైర్యంగా కవిత ఆఫీసులోకి వెళ్లారు. ఆమె భర్త దగ్గరుండి భుజం తట్టి ఈడీ కార్యాలయంలోకి పంపించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే అవకాశం ఉంది.

- Advertisement -

ఇక మార్చి 11న మొదటిసారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ మార్చి 16న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్‌లో ఉండడంతో మార్చి 16వ తేదీన కవిత విచారణకు హాజరుకాలేదు. ఆమె తరుపున న్యాయవాదులను పంపించారు. ఈక్రమంలో 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News