BigTV English

Preethi : క్రిటికల్ గానే మెడికో ప్రీతి హెల్త్ కండిషన్.. సైఫ్ అరెస్ట్..

Preethi : క్రిటికల్ గానే మెడికో ప్రీతి హెల్త్ కండిషన్.. సైఫ్ అరెస్ట్..

Preethi : హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆమెకు వెంటిలేటర్ , ఎక్మోపై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ప్రీతి గుండె, కిడ్నీ పనితీరు కొంత మెరుగు పడిందన్నారు. ఆమె శరీరం చికిత్సకు స్పందిస్తోందని వెల్లడించారు. అయినా సరే ఇంకా పరిస్థితిగా సీరియస్ గానే ఉందన్నారు.


అటు ప్రీతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టెవాడ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. ప్రీతిని వేధించినట్లు సైఫ్ మొబైల్ లో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు మట్టెవాడ పోలీస్ స్టేషన్ ను వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ సందర్శించారు. ఏసీపీ ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘటనపై విచారించారు. ఎంజీఎం ఆస్పత్రిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు విద్యార్థి , ప్రజా సంఘాలు ఆందోళన చేపడతారన్న సమాచారంతో కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం ఆస్పత్రి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇంకో వైపు సైఫ్ కు మద్దతుగా పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రీతి తల్లిదండ్రుల ఒత్తిడితో తప్పుడు కేసులు పెట్టొదని ప్లకార్డులు ప్రదర్శించారు. జూనియర్లకు సూచన చేసే క్రమంలో సైఫ్ చేసిన పోస్టింగ్ ను వేధింపులుగా చూడొద్దని సూచించారు.


ప్రీతిని సైఫ్ ఉద్దేశ్యపూర్వకంగానే వేధించాడని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఆమె డేరింగ్ గల అమ్మాయని పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం కూడా ఎక్కువనేని అన్నారు. తనను వాట్సాప్ గ్రూప్ లో అవమానించవద్దని సైఫ్ ను ప్రీతి కోరిందన్నారు. దీంతో సైఫ్ తట్టుకోలేకపోయాడని సీపీ తెలిపారు.

KMC: ప్రీతి విషయంలో తప్పంతా వారిదేనా? ర్యాగింగ్‌కు కేరాఫ్‌గా కేఎంసీ?

Preethi : క్రిటికల్ గానే మెడికో ప్రీతి హెల్త్ కండిషన్.. సైఫ్ అరెస్ట్..

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×