Big Stories

Nizamabad: బండి, కవిత ములాకత్.. అర్వింద్‌కు ఎర్త్?.. శత్రువుకు శత్రువు మిత్రుడా?

kavitha bandi sanjay

Bandi Sanjay Meets MLC Kavitha(Telangana politics): తెల్లారిలేస్తే ఒకటే మాట. కవిత అరెస్ట్. కవితకు జైల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగుచూసినప్పటి నుంచీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే చెబుతున్న మాట. లిక్కర్ బిజినెస్ చేసి కవిత తెలంగాణ మహిళల పరువు తీసిందని కూడా అన్నారు. కూతురుకి ‘సారా’ బిజినెస్ అంటూ.. కేసీఆర్‌ను అనేక సార్లు విమర్శించారు. ఇలా.. కవితపై బండి సంజయ్ చేసినన్ని విమర్శలు మరెవరూ చేసుండకపోవచ్చు.

- Advertisement -

కేసీఆర్ కుటుంబమంటేనే ఒంటికాలిపై లేస్తుంటారు బండి సంజయ్. గతంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కేసీఆర్‌కు ఎదురుపడినా.. ఆయన ముఖం కూడా చూసేందుకు ఇష్టపడలేదు. అలాంటి బండి.. లేటెస్ట్‌గా మరోసారి కేసీఆర్ కూతురు కవితతో మాటలు కలిపారు. నవ్వుతూ పలకరించుకున్నారు. దండాలు కూడా పెట్టుకున్నారు.

- Advertisement -

నిజామాబాద్‌లో జరిగిందీ ఆసక్తికర సన్నివేశం. జిల్లా బీజేపీ నాయకుడి గృహప్రవేశానికి హాజరయ్యారు ఆ ఇద్దరు. బండి సంజయ్‌కు జిల్లా నేతలను పరిచయం చేశారు కవిత. ఆ సందర్భంలోనే ఇలా పలకరింపులు, స్మైలింగ్‌లు, విష్‌లు. ఏంటి సంగతి?

ఇప్పుడే కాదు గతంలోనూ వాళ్లిద్దరూ ఇలానే ఓపెన్‌గా మంతనాలు జరిపారు. రెండేళ్ల క్రితం దత్తాత్రేయ నిర్వహించయే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చొని.. కొద్దిసేపు చెవుల్లో ఏదో మాట్లాడుకోవడం అప్పట్లోనే రాజకీయ ఆసక్తి రేపింది. ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ స్నేహపూర్వకంగా ఉండటం ఈసారి మాత్రం కలకలం రేపుతోంది.

నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయి పరువంతా పోగొట్టుకున్నారు కవిత. కేసీఆర్ కూతురు ఓడిపోవడం గులాబీ పార్టీ ఇమేజ్‌కి సైతం బాగానే డ్యామేజ్ చేసింది. ఆ ఓటమి భారంతో బాగా కుంగిపోయారు కవిత. కొన్నాళ్లు ఏ రాజకీయ వేదికపైనా కనిపించలేదు. తండ్రిపై, అన్నపై అలిగారు కూడా. ప్రగతిభవన్‌కు కూడా రాలేదు. చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ పిలిచి.. కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టడంతో కాస్తా కుదుటపడ్డారని అంటారు. అప్పటినుంచి తనను ఓడించిన అర్వింద్‌పై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అర్వింద్‌ ఓటమి కోసమే తాను పని చేస్తానంటూ ఓపెన్ సవాల్ కూడా విసిరారు. కొన్నిరోజుల క్రితం లిక్కర్ స్కాంలో ఎంపీ అర్వింద్ ఏదో అన్నారనే కారణంతో.. కవిత అనుచరులు ఆయన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇక, జిల్లా పర్యటనల్లో అర్వింద్‌ను పలుమార్లు అడ్డుకున్నారు గులాబీ శ్రేణులు. ఇలా వారి మధ్య వార్.. ఓ రేంజ్‌లో సాగుతోంది. ఇదంతా ఎందుకంటే…

అటు, బండి సంజయ్‌కు ధర్మపురి అర్వింద్‌కు మధ్య పార్టీలో కోల్డ్ వార్ జరుగుతోందని అంటారు. వారిద్దరికి అసలేమాత్రం పడదని చెబుతుంటారు. బండి మీద కోపంతోనే.. అర్వింద్ హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసుకు కూడా రారనేది ఓపెన్ సీక్రెట్. బండి సంజయ్‌కు యాంటీగా గ్రూపులు కట్టే నేతల్లో అర్వింద్ ముందుంటారని పార్టీ వర్గాల్లో టాక్.

ఇలా, శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ప్రకారం.. కవిత, బండి సంజయ్‌లకు ఉమ్మడి శత్రువైన ధర్మపురి అర్వింద్‌ వల్లే వాళ్లిద్దరూ అలా పరస్పర అభిమానం ప్రదర్శిస్తారని అంటున్నారు. పార్టీ విధానాల్లో ఒకరికొకరికి పడకున్నా.. నిజామాబాద్ రాజకీయం విషయానికొచ్చే సరికి అర్వింద్‌కు వ్యతిరేకంగా కలిసిపోతున్నారని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వాళ్లిద్దరూ లోపాయికారిగా సహకరించుకుంటారా? అర్వింద్ ఓటమి కోసం కలిసికట్టుగా కృషి చేస్తారా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News