EPAPER

Preethi: సైఫ్‌కి సపోర్ట్‌గా సమ్మె.. ర్యాగింగ్ కాదు మందలింపే!.. ప్రీతి విషయంలో ఏది నిజం?

Preethi: సైఫ్‌కి సపోర్ట్‌గా సమ్మె.. ర్యాగింగ్ కాదు మందలింపే!.. ప్రీతి విషయంలో ఏది నిజం?

Preethi: ఇది కాస్త డిఫరెంట్ న్యూస్. ఏదైనా ర్యాగింగ్ ఘటన జరిగితే విద్యార్థిలోకం భగ్గుమంటుంది. సంఘాలన్ని నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్లు చేస్తుంటాయి. దిష్టిబొమ్మల దగ్థం, ధర్నాలు, నిరసనలతో ఉద్యమిస్తాయి. కానీ, వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ప్రీతిని వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే, సైఫ్‌పై అన్యాయంగా కేసులు పెడుతున్నారని.. తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. విచారణ పూర్తి కాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.


సైఫ్‌కి మద్దతుగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహా ఓపీ, మిగిలిన సేవలను బహిష్కరించారు పీజీ మెడికల్ విద్యార్థులు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసులు కూడా ఇవ్వడంతో మరింత అలజడి మొదలైంది.

డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం విచారకరమని.. ఇదే సమయంలో సైఫ్‌పై అసాధారణమైన కేసులు నమోదు చేయడం సరికాదంటున్నారు మెడికోస్. సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. తమ వృత్తిలో జూనియర్లను సీనియర్లు పని విషయంలో మందలించడం కామనేనని.. ఇది కొత్తేమీ కాదంటూ.. చిన్న విషయానికే పెద్ద కేసులు పెట్టారని.. వెంటనే సైఫ్‌పై కేసులను ఎత్తివేయాలని వారంతా డిమాండ్‌ చేశారు. ఇలా, ర్యాగింగ్, సూసైడ్ అటెంప్ట్ కేసులో నిందితుడికి మిగతా విద్యార్థులు మద్దతుగా నిలవడం బహుషా ఇదే మొదటిసారి కావొచ్చని అంటున్నారు.


అటు, ప్రీతి కేసుపై వరంగల్ సీపీ రంగనాథ్ పలు విషయాలు చెప్పారు. పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సీనియర్‌ స్టూడెంట్ సైఫ్‌ వేధించాడని అన్నారు. ‘‘ప్రీతి చాలా తెలివైన, ధైర్యం ఉన్న అమ్మాయి. అలాగే ఆమెది సున్నిత మనస్తత్వం కూడా. కేస్‌ షీట్‌ విషయంలో ప్రీతిని అవమానించేలా సైఫ్‌ మాట్లాడాడు. వాట్సాప్‌ గ్రూపులో అతడు పెట్టిన మెసేజ్‌పై ప్రీతి పర్సనల్‌గా ప్రశ్నించింది. తనను ఉద్దేశించి గ్రూప్‌లో వ్యక్తిగతంగా చాట్‌ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. సైఫ్‌ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అతడు తనను టార్గెట్‌ చేసి వేధిస్తున్నాడని స్నేహితులతో చేసిన చాటింగ్‌లో ప్రీతి చెప్పింది. బ్రెయిన్‌ లేదంటూ సైఫ్‌ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి ఇన్‌సల్ట్‌గా ఫీలయితే అది ర్యాగింగ్‌ కిందికే వస్తుంది. ప్రీతినే లక్ష్యంగా చేసుకుని అవహేళన చేసినట్లు చాటింగ్‌ ద్వారా వెల్లడైంది. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశాం”.. అని సీపీ రంగనాథ్ తెలిపారు.

సీపీ మాటలను బట్టి చూసినా.. ఈ కేసులో డివైడ్ టాక్ మొదలైంది. ప్రీతిని సున్నిత మనస్తత్వం అని తెలుస్తోంది. సైఫ్ ఆమెను అందరిముందు హేళన చేయడాన్ని తట్టుకోలేకపోయిందని అర్థమవుతోంది. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసిన విషయం వాస్తవమే. అయితే, అది వర్క్ విషయమేననేది తోటి విద్యార్థుల సమర్థింపు. పదే పదే సైఫ్ తనను కార్నర్ చేయడాన్ని ప్రీతి తట్టుకోలేకపోయింది. అది భరించలేక ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరి, సైఫ్ టూమచ్‌గా టార్చర్ చేశాడా? ప్రీతినే బాగా హర్ట్ అయి ఇలాంటి నిర్ణయం తీసుకుందా?

ప్రీతి కేసులో సైఫ్ పేరు వినబడగానే బీజేపీ సైతం రంగంలోకి దిగింది. ఇది పక్కా లవ్ జిహాద్ ఘటనే అని బండి సంజయ్ ఆరోపించారు. సైఫ్‌పై లవ్ జిహాదీ కేసునే పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు, నిందితుడు సైఫ్.. హోంమంత్రి మహ్మద్ అలీకి బంధువంటూ, అందుకే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రీతి తండ్రి నరేందర్ ఆరోపిస్తున్నారు.

KMC: ప్రీతి విషయంలో తప్పంతా వారిదేనా? ర్యాగింగ్‌కు కేరాఫ్‌గా కేఎంసీ?

Preethi : క్రిటికల్ గానే మెడికో ప్రీతి హెల్త్ కండిషన్.. సైఫ్ అరెస్ట్..

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×