Telangana BJP news today(Political news in Telangana) : కొన్నిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అంతగా న్యూస్‌లో లేరు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హడావుడి మాత్రం బానే కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? స్టేట్ ప్రెసిడెంట్ కంటే కూడా ఈటలనే కీలక నేతగా మారారా? కర్నాటక ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ ఈక్వేషన్‌ను మార్చేశాయా? ఈటల జోరు.. బండి బేజారు.. కమల కల్లోలానికి నిదర్శనమా?
ఇలా కర్నాటక రిజల్ట్స్ వచ్చాయో లేదో.. అలా ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి పిలిపించింది బీజేపీ అధిష్టానం. అప్పుడే ఏదో తేడా కొట్టింది. పిలిస్తే గిలిస్తే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని రమ్మనాలి కానీ, ఈటలతో మంతనాలు ఏంటి? అదికూడా వరుసగా మూడు రోజులు సుదీర్ఘ చర్చలు జరిపారంటే మాటలా? కర్నాటక తర్వాత తెలంగాణనే టార్గెట్ అంటుండగా.. కీలక సమయంలో ఈటల రాజేందర్ కీలక నేతగా కనిపించారా? బండి కంటే ఈటలనే బెటర్ అనుకున్నారా? ఇలా అనేక ప్రశ్నలు.
సరే. ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపొచ్చారు. మరి, మర్యాద పూర్వకంగానైనా పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్‌ను కలిశారా? కలిసి ఢిల్లీ చర్చల సారాంశాన్ని వివరించారా? లేదే. సరేలే కలవలేదే అనుకున్నా.. ఆ తర్వాత ఈటల మాట్లాడిన మాటలు మరింత ఆసక్తికరం. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడిని మార్చే అవకాశం లేదని.. బండినే అధ్యక్షుడిగా ఉంటారని ఈటల అన్నారు. అంటే.. బండి సంజయ్ పోస్టుకు ఈటల గ్యారెంటీ ఇచ్చే స్థాయికి ఎదిగారా? ఆ మేరకు ఢిల్లీ నుంచి ఆయనకు ఫుల్‌గా అండా దండా లభిస్తోందా? అందుకే, బండికే భరోసా ఇచ్చి.. ఆయన స్థాయిని తగ్గించారా? ఇక తాను పదవుల కోసం అడగనని.. పార్టీ తన సేవలను ఎలా వాడుకున్నా పర్వాలేదంటూ కొన్ని రొటీన్ స్టేట్‌మెంట్స్ చేశారే కానీ.. ఢిల్లీ చర్చల సంగతేంటో ఎక్కడా లీక్ చేయలేదు.
కట్ చేస్తే.. హైదరాబాద్ శివార ఓ ఫామ్‌హౌజ్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో ఈటల రాజేందర్ రహస్యంగా భేటీ అవడం మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే గియితే పార్టీలో చేరికలపై అధ్యక్షుడు చర్చించాలి కానీ, బండిని సైడ్ చేసి ఈటలను ముందుంచడం బీజేపీ అధిష్టానం ప్రయారిటీని చెప్పకనే చెబుతోంది. అంటే.. కేసీఆర్‌పై మాటల దాడికి బండిని.. గులాబీ దండును దెబ్బకొట్టేందుకు ఈటలను ప్రయోగిస్తోందా? ఆ రకంగా చూస్తే.. ఇద్దరికీ అధిష్టానం దగ్గర అధిక ప్రాధాన్యమే ఉందా? పార్టీలో మోనోపాలిజం లేకుండా.. బాసిజం పెరగకుండా.. డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీని అప్లై చేస్తోందా? ఎవరి టాలెంట్‌ను బట్టి వారికి బాధ్యతలు అప్పగిస్తోందా? అదికాస్తా పార్టీలో కోల్డ్ వార్‌కు దారి తీస్తోందా? ముందుముందు ఆధిపత్య పోరు మరింత ముదురుతుందా? ఏమో!
Leave a Comment