Big Stories

BJP: ఢిల్లీలో ఈటల.. అందుకే..నా?

Telangana BJP Latest News(Telugu News Live Today): శనివారం కర్నాటక ఎన్నికల ఫలితాలొచ్చాయి. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సోమవారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు ఈటల రాజేందర్. రెండు రోజులుగా హస్తినలోనే ఉన్నారు. పార్టీ పెద్దలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఏంటి సంగతి? కర్నాటక రిజల్ట్స్ రాగానే.. ఈటలను హైకమాండ్ ఎందుకు ఢిల్లీకి పిలిపించింది? కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లాంటి వారిని కాదని.. రాజేందర్ అంతగా ఏం చర్చలు చేస్తున్నట్టు? తెలంగాణలో కీలక పరిణామాలేవో జరగబోతున్నాయా? ఈటలనే కీ రోల్ ప్లే చేయబోతున్నారా?

- Advertisement -

కర్నాటక ఓటమితో బీజేపీకి సౌత్ గేట్ మూసుకుపోయింది. దక్షిణాదిన ఉనికి నిలుపుకోవడానికి ఆ పార్టీకున్న ఏకైక ఛాన్స్ తెలంగాణే. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు రానుండటంతో.. కర్నాటకలో పోయిన పరువును తెలంగాణలో నిలుపుకోవాలని డిసైడ్ అయింది. అయితే, ఆ ఓటమి ఇక్కడ పార్టీ బలోపేతంపై ఎంతోకొంత ఉండకపోదు. తటస్థులు, బీఆర్ఎస్ అసంతృప్తులు ఈ సమయంలో బీజేపీలో చేరాలంటే కాస్త వెనక్కి తగ్గొచ్చు. ఆపరేషన్ ఆకర్ష్‌కు చెక్ పడొచ్చు. మిషన్ 90 టార్గెట్ ప్రమాదంలో పడొచ్చు. అందుకే, బీజేపీపై భయాందోళనలు పోవాలంటే.. పార్టీపై ధీమా పెరగాలంటే.. అర్జెంటుగా ప్రముఖ నేతలను పార్టీలో చేర్చుకుని.. కాషాయ కండువా కప్పేయాల్సిందే. ఈ సమయంలో చేరికలతోనే బీజేపీపై భరోసా పెంచొచ్చు అనేది అధిష్టానం భావన. అందులో భాగంగానే చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ను యమ అర్జెంటుగా ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది.

- Advertisement -

పొంగులేటి, జూపల్లి. ఫస్ట్ టార్గెట్ వీరిద్దరే. ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 స్థానాల్లో బీజేపీకి పట్టు చిక్కినట్టే. వరంగల్, నల్గొండలోనూ ఎంతోకొంత ఛాన్స్ దొరికినట్టే. ఇక, జూపల్లి కృష్ణారావుతో పాలమూరు జిల్లాలో మరింత ప్రభావం చూపించొచ్చు. ఇదీ బీజేపీ లెక్క. ఇటీవలే పొంగులేటి, జూపల్లిలతో ఈటల బృందం గంటల తరబడి చర్చలు కూడా జరిపింది. కానీ, అటునుంచి ఇంకా పాజిటివ్ సిగ్నల్స్ రాలేదు. కాంగ్రెస్ సైతం వారిద్దరిపై ఫోకస్ పెట్టడం, ఢిల్లీ నుంచి రాహుల్ టీమ్ వచ్చి మరీ బేరసారాలు ఆడటంతో పోటీ పెరిగింది. పొంగులేటికి డిమాండ్ కూడా పెరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా.. పొంగులేటి మిస్ అయ్యే ఛాన్స్ ఉందని కమలదళం కంగారు పడుతోంది. కర్నాటక ఓటమి.. ఆ పార్టీని కలవర పెడుతోంది. అందుకే, హడావుడిగా ఈటలను ఢిల్లీకి రప్పించి.. చేరికలపై చర్చిస్తున్నట్టు సమాచారం. హస్తిన నుంచే బీజేపీ పెద్దలు.. పొంగులేటితో ఫోన్లో సంప్రదింపులు కూడా జరిపారని టాక్.

మరి, పొంగులేటి దారెటు? డిమాండ్ ఉన్నప్పుడే బీజేపీలో చేరితే.. ఆ ఆఫర్లే వేరేలా ఉంటాయి. మరి, కర్నాటక మాదిరే తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని తెలిస్తే.. హస్తం గూటికి చేరకుండా ఉంటారా? భట్టి విక్రమార్క స్థానం తప్ప.. మిగతా 9 సీట్లు ఇస్తామని ఇప్పటికే రాహుల్ టీమ్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అయితే 10కి 10 ఇస్తామన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి, రెండూ మంచి ఆఫర్లే.. మరి, ఆ రెండు జాతీయ పార్టీల్లో పొంగులేటి, జూపల్లి ఏ పార్టీకి జై కొడతారు? ఈటల రాయబారం వర్కవుట్ అవుతుందా? కాషాయ గాలానికి పొంగులేటి చిక్కుతారా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News