EPAPER

Have budget secrets been leaked abroad? : బడ్జెట్ రహస్యాలు విదేశాలకు లీకయ్యాయా?

Have budget secrets been leaked abroad? : బడ్జెట్ రహస్యాలు విదేశాలకు లీకయ్యాయా?


Have budget secrets been leaked abroad? : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో గూఢచర్యం కలకలం రేపుతోంది. కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సుమిత్ అనే వ్యక్తి… ఆర్థిక శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు… అతణ్ని అరెస్ట్ చేశారు. అతని ద్వారా ఏయే రహస్యాలు విదేశాల చేతుల్లోకి వెళ్లాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కొద్దిరోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో… ఈ పరిణామం కలకలం రేపింది.

ఆర్థికశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని సుమిత్ విదేశాలకు అందిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌ గుర్తించింది. సమాచారం చేరవేసినందుకు నిందితుడు భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని పోలీసులు చెప్పారు. అధికారిక రహస్యాల చట్టం కింద సుమిత్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు… అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. సమాచారాన్ని చేరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్‌ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.


2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఈ సమయంలో గూఢచర్యం ఘటన బయటకు రావడం కలకలం రేపుతోంది. బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలు విదేశాల చేతుల్లోకి వెళ్తే… దేశ మార్కెట్‌పై అది ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఇటీవల తరచూ గూఢచర్య ఘటనలు బయటపడుతుండటం దేశ భద్రతకు సవాలుగా మారుతోంది. రెండు నెలల కిందటే విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖలో గూఢచర్యం ఆరోపణలపై ఓ డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ వలపు వలలో చిక్కుకున్న నిందితుడు… కీలక పత్రాలు, సమాచారం చేరవేసి… ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అంతలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖలోనూ గూఢచర్యం జరగడం అందర్నీ విస్మయపరుస్తోంది.

Follow this link for more updates :- Bigtv

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×