BigTV English

New slabs in IT? Is it a relief for the middle class? : ఆదాయ పన్ను విధానంలో కొత్త స్లాబ్‌లు? మధ్యతరగతికి ఊరటేనా?

New slabs in IT? Is it a relief for the middle class? : ఆదాయ పన్ను విధానంలో కొత్త స్లాబ్‌లు? మధ్యతరగతికి ఊరటేనా?


New slabs in IT? Is it a relief for the middle class? : ప్రతీ ఏడాదీ బడ్జెట్‌కు ముందు… ఈసారి వేతన జీవులకు ఊరట, మధ్యతరగతికి ఉపశమనం అంటూ ఎన్నో వార్తలు రావడం, తీరా బడ్జెట్ ప్రవేశపెట్టాక అంతా ఉసూరుమనడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ప్రతీ ఏడాది లాగానే ఈసారి కూడా… వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బడ్జెట్‌లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు ఉంటాయని… పన్ను రేట్లు తగ్గించి కొత్త పన్ను స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. ఇక ప్రధాని కార్యాలయం తుది నిర్ణయమే తరువాయి అని చెబుతున్నారు.

పాత పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది… కేంద్ర ప్రభుత్వం. పాత పన్ను విధానంలో కేవలం మూడు స్లాబ్‌లే ఉండేవి. కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లు తీసుకొచ్చారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం… రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం… రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం… రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం… రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం… రూ.15 లక్షలు ఆపై ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను వర్తించేలా ఆరు స్లాబ్‌లు ప్రవేశపెట్టారు. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే దానిపై… పన్ను చెల్లింపుదారులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇందులో పన్ను మినహాయింపులను చూపించేందుకు అవకాశం లేదు.


ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతికి పెద్దపీట వేయాలని భావిస్తున్న కేంద్రం… ఆదాయ పన్ను విషయంలో ఊరటనిచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. కొత్త పన్ను విధానంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.15 లక్షలు, ఆపై ఉన్న ఆదాయం మొత్తానికి 30 శాతం పన్ను వర్తిస్తుండగా… ఆదాయ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎప్పట్లాగే ఇదంతా కేవలం ప్రచారామేనా? లేక నిజంగానే వేతన జీవులు, మధ్యతరగతికి ఊరట దక్కుంతుందా? అనేది బడ్జెట్ వచ్చాక చూడాలి.

Follow this link for more updates :- Bigtv

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×