EPAPER

Job’s lost in last 6 days :- 6 రోజుల్లో ఎన్ని ఉద్యోగాలు ఊడాయంటే..

Job’s lost in last 6 days :- 6 రోజుల్లో ఎన్ని ఉద్యోగాలు ఊడాయంటే..

Jobs lost in last 6 days:- ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రైవేట్ ఉద్యోగికీ జాబ్ గ్యారెంటీ లేకుండా పోయింది. ఏ క్షణం ఏ కంపెనీ లే ఆఫ్స్ ప్రకటిస్తుందో తెలియక, బడా సంస్థల ఉద్యోగులు కూడా భయంభయంగా గడుపుతున్నారు. తాజాగా 10 వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ తాజా తొలగింపుతో… 6 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 30,611గా తేలింది. ఇందులో పది వేల మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కాగా… 18 వేల మంది అమెజాన్ సిబ్బంది. ఇక షేర్‌చాట్‌ 20 శాతం మందిని, సేల్స్‌ ఫోర్స్‌ 10 శాతం మంది ఉద్యోగుల్నీ ఇంటికి పంపించేశాయి.


ఉద్యోగుల తొలగింపు అనేది చాలా కఠిన నిర్ణయమమన్న సత్య నాదెళ్ల… అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్ల తప్పలేదని చెప్పుకొచ్చారు. కొవిడ్‌ సమయంలో పెంచిన డిజిటల్‌ వ్యయాలను స్థిరీకరించేందుకు మార్పులు చేస్తున్నామని… మొత్తం సిబ్బందిలో 10 వేల మందిని 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి తొలగిస్తామని ఆయన తెలిపారు. ఈ సంఖ్య… సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానం. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో 2 లక్షల 20 వేల మందికి పైగా పని చేస్తున్నారు. జాబ్ పోయిన ప్రతి వ్యక్తికి ఇది సవాలు సమయమని తనకు తెలుసని… ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు… సత్య నాదెళ్ల.

అమెజాన్‌ కూడా 18 వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నామని ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది ఒక శాతానికి సమానం. మాంద్యం రావొచ్చన్న ఆందోళనలు, అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోవడమే ఉద్యోగుల తొలగింపునకు కారణమని అమెజాన్ ప్రకటించింది. దీని వల్ల ఖర్చులు తగ్గి, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవచ్చని అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ అభిప్రాయపడ్డారు. మెటా కూడా గత నవంబరులో మొత్తం 11 వేల మంది ఉద్యోగుల్ని తొలృగించింది.


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

Big Stories

×