BigTV English

Telangana Highcourt : తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..?

Telangana Highcourt : తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..?

Telangana Highcourt : డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 20 కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ(ఆర్ట్స్‌/ సైన్స్‌/ లా) లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంగ్లీష్‌ హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌, పీజీ డిప్లొమా (కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా బీసీఏ చేసి ఉండాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 34 ఏళ్లు మించరాదు. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఇచ్చారు. ఉద్యోగులను సీబీటీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. అందులో టైపింగ్ టెస్ట్ 40 మార్కులకు, ఇంటర్వ్యూ 10 మార్కులకు ఉంటుంది. ఆన్ లైన్ లో దరఖాస్తులను జనవరి 21 నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తులను పంపించడానికి ఫిబ్రవరి 11 వరకు గడువు ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2023 మార్చిలో నిర్వహిస్తారు.


అర్హత : బ్యాచిలర్‌ డిగ్రీ(ఆర్ట్స్‌/ సైన్స్‌/ లా), ఇంగ్లీష్‌ హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌, పీజీ డిప్లొమా (కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా బీసీఏ
ఎంపిక : సీబీటీ పరీక్ష (50 మార్కులు), టైపింగ్‌ టెస్ట్‌ (40 మార్కులు), ఇంటర్వ్యూ (10 మార్కులు)
వయసు : 11-01-2023 నాటికి 34 సంవత్సరాలు మించరాదు. (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు)
దరఖాస్తు రుసుం : ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.600 , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400
ఆన్‌లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 21-01-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 11-02-2023
హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం : 20-02-2023
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ : మార్చి 2023

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails


Tags

Related News

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

Big Stories

×