BigTV English

Taraka Ratna : తారకరత్న లక్ష్యాలు అవే…. ఆ రెండు కోరికలు తీరకుండానే..

Taraka Ratna : తారకరత్న లక్ష్యాలు అవే…. ఆ రెండు కోరికలు తీరకుండానే..

Taraka Ratna : నందమూరి తారకరత్న తన లక్ష్యాలను చేరుకోకుండానే తరలిరాని లోకాలు వెళ్లిపోయారు. ఆయనకు బాలకృష్ణతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. బాలయ్య బాటలోనే సినిమాల్లో ప్రవేశించారు. బాబాయ్ సూచనలు, సలహాలు పాటిస్తూ కెరీర్ లో ముందుకుసాగారు. బాలయ్య కూడా తారకరత్నపై ఎనలేని ప్రేమను చూపించేవారు. తారకరత్న కెరీర్ ముందుకు సాగడానికి గైడెన్స్ ఇచ్చేవారు.


బాబాయ్ తో నటించాలని…
22 సినిమాల్లో నటించిన తారకరత్న .. బాబాయ్ బాలయ్యతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలనుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ఉంటుందని అందరూ భావించారు. బాబాయ్, అబ్బాయ్ కలిసి నటిస్తే వెండితెరపై చూసి మురిసిపోవాలని నందమూరి అభిమానులు ఆశించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రంలో తారకరత్న ఓ కీలక పాత్ర చేయాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట. అయితే అది కార్యరూపం దాల్చాల్సిఉంది. కానీ విధిరాత మరోలా ఉంది. బాబాయ్ బాలయ్యతో నటించాలన్న తన కోరిక నెరవేరకుండానే తారకరత్న గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

రాజకీయ ఎంట్రీకి సిద్ధమై..
తారకరత్నకు రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉండేది. చాలాసార్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల సమయాల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఇక రాజకీయ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి తారకరత్న బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో తారకరత్నకు మంచి స్నేహం ఉండేదని అందరూ చెప్పేవారు. లోకేష్ కూడా తారకరత్న రాజకీయాల్లో రావడాన్ని ఆహ్వానించి ప్రోత్సహించారు. ఇంతలో తారకరత్న ప్రాణాలు కోల్పోవడం టీడీపీ కార్యకర్తలను ఎంతో మనోవేదనకు గురిచేస్తోంది.


అవకాశం కల్పిద్దాం అనుకున్నాం..
హైదరాబాద్‌లో తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు .. తారకరత్న గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఆయన కోలుకుని తిరిగొస్తారని ఆశించామని చెప్పారు. చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోందని కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తారకరత్న తనతో చెప్పినట్లు వెల్లడించారు. మంచి భవిష్యత్‌ ఉన్న వ్యక్తిని కోల్పోయామని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇద్దామనుకున్నామని.. దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని ఆయనతో చెప్పానని చంద్రబాబు వివరించారు. ఏ ఆశయాల కోసం తారకరత్న పనిచేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు కృషి చేయాలని చంద్రబాబు కోరారు. బాబాయ్ బాలయ్యతో నటించాలనే కల, రాజకీయాల్లో రాణించాలనే లక్ష్యం.. ఈ రెండు కోరికలు తీరకుండా తారకరత్న మరణించడం చాలా బాధాకరమని అభిమానులు అంటున్నారు.

Heart attack: గుండెపోటు దడ.. 18 నెలలు.. ఏడుగురు సెలబ్రెటీల మృతి

Telugu Film Producers Council: నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్‌ ప్రసాద్‌ గెలుపు..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×