BigTV English

Telugu Film Producers Council: నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్‌ ప్రసాద్‌ గెలుపు..

Telugu Film Producers Council: నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్‌ ప్రసాద్‌ గెలుపు..

Telugu Film Producers Council : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడిగా కె.ఎల్ దామోదర్ ప్రసాద్ ఎన్నికయ్యారు. 339 మంది సభ్యులు ఆయనకు ఓటేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడిన జెమిని కిరణ్ కు 315 ఓట్లు మాత్రమే వచ్చాయి . దీంతో దామోదర ప్రసాద్ 24 ఓట్ల తేడాతో గెలిచారు. ఉపాధ్యక్షులుగా వై. సుప్రియ, కె. అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా టి. రామ సత్యనారాయణ ఎన్నికయ్యారు. సెకటర్రీలుగా టి. ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి గెలిచారు. జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్ విజయం సాధించారు.


ఎగ్జికూటివ్ కమిటీ సభ్యులుగా దిల్ రాజు, డీవీవీ దానయ్య, యలమంచిలి రవిశంకర్, పీవీ రవికిశోర్, బెక్కం వేణుగోపాల్, వై. సురేందర్ రెడ్డి, ఎన్. పద్మిని, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, పల్లి కేశవరావు, వజ్జ శ్రీనివాసరావు, తోట కృష్ణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, అభిషేక్ అగర్వా,ల్, పూసల కిశోర్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏర్పడిన నిర్మాతల మండలి కొత్త కార్యవర్గం 2025 వరకు కొనసాగుతుంది.

కలిసి పని చేస్తాం: సి. కల్యాణ్‌
నిర్మాతల మండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని నిర్మాత సి. కళ్యాణ్‌ ప్రకటించారు. ఇకపై అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ను కూడా నిర్మాతల మండలిలో కలపాలని కోరారు. ఇద్దరు వ్యక్తుల వల్ల వ్యవస్థ చెడిపోయిందని ఆరోపించారు. ఆ ఇద్దర్నీ అందరూ గుర్తించి ఓడగొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.


Taraka Ratna : తారకరత్న లక్ష్యాలు అవే…. ఆ రెండు కోరికలు తీరకుండానే..

Heart attack: గుండెపోటు దడ.. 18 నెలలు.. ఏడుగురు సెలబ్రెటీల మృతి

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×