EPAPER

Heart attack: గుండెపోటు దడ.. 18 నెలలు.. ఏడుగురు సెలబ్రెటీల మృతి

Heart attack: గుండెపోటు దడ.. 18 నెలలు.. ఏడుగురు సెలబ్రెటీల మృతి

Heart attack: హార్ట్ ఎటాక్.. చిన్నా లేదు.. పెద్దా లేదు. అందరూ దీని బారిన పడుతున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయి.. తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. గడిచిన రెండేళ్లలో గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నుంచి శనివారం కన్నుమూసిన నందమూరి తారకరత్న వరకు.. ఇలా 18 నెలల్లో ఏడుగురు సెలబ్రెటీలు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.


అప్పటి వరకు జిమ్‌లో వ్యాయామం చేసిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. 46 ఏళ్ల వయస్సులో 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ సింగ్ కెకె కూడా ఓ కళాశాలలో ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారు. 53 ఏళ్ల వయస్సులో 31 మే 2022లో కెకె చనిపోయారు.


అలాగే నటుడు సిద్ధార్థ్ శుక్లా కూడా 40 ఏళ్ల వయస్సులో 2 సెప్టెంబర్ 2021న హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. రాత్రి సమయంలో పడుకొని నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఇక నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 2022 నవంబర్ 11న జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా హార్ట్ ఎటాక్‌తోనే ప్రాణాలు కోల్పోయారు. 49 ఏళ్ల వయస్సులో 21 ఫిబ్రవరి 2022న చనిపోయారు. గౌతమ్ రెడ్డి కూడా జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తూనే గుండెపోటుకు గురయ్యారు.

స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ కూడా 41 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలో ఓ జిమ్‌లో వర్క్అవుట్ చేస్తుండగా.. గుండెపోటుకు గురయ్యారు. జిమ్ నిర్వాహకులు అతడిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 2022 సెప్టెంబర్ 21న తుదిశ్వాస విడిచారు.

ఇక ఇప్పుడు నందమూరి తారకరత్న. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కాసేపటికే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. 18 ఫిబ్రవరి 2023న తారకరత్న తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది.

Telugu Film Producers Council: నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్‌ ప్రసాద్‌ గెలుపు..

Taraka Ratna : తారకరత్న లక్ష్యాలు అవే…. ఆ రెండు కోరికలు తీరకుండానే..

Related News

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Big Stories

×