BigTV English

God in your dreams:- కలలో మీకు ఏ దేవుడు కనిపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది?

God in your dreams:- కలలో మీకు ఏ దేవుడు కనిపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది?

God in your dreams:- ప్రతీ ఒక్కరు నిద్రలో కలలూ కంటూ ఉంటారు. ఎక్కువశాతం కలలు గుర్తుండవు . కొన్ని కలలు మంచివి ఉంటాయి. చెడ్డవి ఉంటాయి. కొన్ని మనకు గుర్తుకు ఉంటాయి. ముఖ్యంగా కలలో దేవుడు కనిపిస్తుంటే వాటి అర్థం ఇదే.


కలలో శ్రీకృష్ణుని దర్శనం
శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.

కలలో విష్ణువు దర్శనం..
మీ కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.


లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..
మీ స్వప్నంలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.

శివుడిని కలలో చూస్తే..
మీ కలలో శివుడిని చూసినట్లయితే, సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

రాముడిని కలలో చూస్తే
కలలో శ్రీరాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.

Follow this link for more updates:- Bigtv latest updates

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×