BigTV English
Advertisement

Raavi Akula Deepam:- రావి ఆకులపై దీపం వెలిగిస్తే…

Raavi Akula Deepam:- రావి ఆకులపై దీపం వెలిగిస్తే…

RAAVI AKULA DEEPAM:- రావి ఆకులపై ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే అత్యంత ఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. రావిచెట్టుకి ఎన్నో ప్రత్యేకతలు న్నాయి. శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ


రావిచెట్టు తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంట్లో రావిచెట్టు ఆకులను ఉంచిదానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు ఉండవని నమ్ముతారు. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి..
దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి..శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు-కేతుదోషాలు, నవగ్రహ దోషాలు

తొలగిపోతాయి.


రావిచెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా, ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి.

ఇలా చేస్తే దోషాలు తొలగి మంచి ఫలితాలను ఆశించవచ్చనేది ఆధ్యాత్మిక పండితులు మాట. సోమవారం పుట్టిన వాళ్లు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి.
మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు, గురువారం నాడు పుట్టిన వాళ్లు ఐదు దీపాలు, శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు,

శనివారం పుట్టినోళ్లు 9 దీపాలు, ఆదివారం జన్మదినం ఉన్న జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి…శ్రీమహాలక్ష్మిఅనుగ్రహం

పొందాలంటే..తమలపాకుపై ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం శుభప్రదం. ఇంకా తమలపాకుపై ప్రమిదను ఉంచి నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక పండితులు

సూచిస్తున్నారు

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×