EPAPER

Naga Sindooram:- నాగ సింధూరం వాడితే కొత్త కాంతులు వస్తాయా…

Naga Sindooram:- నాగ సింధూరం వాడితే కొత్త కాంతులు వస్తాయా…

Naga Sindooram:- నాగసింధూరాన్ని ధరిస్తే దిష్టదోషాలు, బంధు గోషాలు, మొత్తం తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ప్రత్యేకంగా సర్పదోషాలకు నాగసింధూరం ఒక పరిష్కారం చూపుతుంది. బొట్టుగా పెట్టుకోవడం వల్ల ముఖానికి వర్చస్సు పెరుగుతుంది . ముఖార విందంలో కాంతి పెరగడానికి ఉపయోగపడుతుంది. అనేక రకాల దోషాల నుంచి నాగసింధూరం కాపాడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


ప్రతి రోజు నాగసింధూరం నుదుటన ధరిస్తే అంతా మంచే జరుగుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. అదనపు ఖర్చులు పెరగకుండా తగినంత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆకర్షణా శక్తిని నాగసింధూరం కలిగిస్తుంది.

దుర్గామాత ఎదుట నాగసింధూరాన్ని ఉంచి పూజ చేయాలి . పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఈసింధూరంతో పూజ చేయాలి. అమ్మవారి చిత్రపటం ఉంటే కాళ్లపై పడేలా సింధూరం వేస్తూ అష్టోత్తర శతనామావాళి జపించాలి. తర్వాత ఒక డబ్బాలోస్టోర్ చేసుకుని వాడటం మొదలుపెట్టవచ్చు. మార్కెట్లో దొరికే వసకొమ్మును మెత్తగా దంచేసి చూర్ణాన్ని నాగసింధూరంలో కలిపి వాడుకోవడం మరిన్ని అదనపులు ఫలితాలు వస్తాయని విశ్వాసం. ప్రత్యేకమైన రోజుల్లో ఈ పని చేయాలి. ఇలా సింధూరం పెట్టుకోవడం ముఖంలో కాంతి పెరిగి ఇతరులు ఆకర్షించబడతారని పండితులు చెబుతున్నారు. వశీకరణం కింద కూడా ఈ సింధూరం పనికివస్తుంది. ఇష్టమైన వాళ్లతో ఈ బొట్టు ప్రతీ రోజు పెట్టించుకోవాలి.


ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు పడేవారు ఈ నాగసింధూరం వాడితే విభేదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో వాళ్ల మాటకన్నా బయట వారి మాటలు నమ్మేవారిని దారిలోకి తెచ్చుకునేందు ఇది ఉపయోగపడుతుందని విశ్వాసం.

Follow this link for more updates:-Bigtv

Tags

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×