EPAPER

Coconut:పిలకలేని కొబ్బరికాయ కొట్టొచ్చా..

Coconut:పిలకలేని కొబ్బరికాయ కొట్టొచ్చా..

Coconut:దేవుడిని చేరేందుకు తొమ్మిది రకాలైన భక్తి మార్గాలన్నాయి. అందులో ఆఖరిది ఆత్మ నివేదనం. అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి, దైవానికి నైవేద్యంగా సమర్పించాలి.


పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. టెంకాయను మనిషి శిరస్సుతో పోల్చుతారు. కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయ పైనుండే పొర – చర్మం. పీచు – మాంసం. దృఢంగా ఉండే చిప్ప- ఎముకలు. అందులో ఉండే కొబ్బరి -మనిషిలోని ధాతువు. సుషుమ్న నాడులు. జుట్టు- అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించుకోవాలి. ఇందులోని పరమార్థమిదే. అందుకే పిలక లేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది.

త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి, అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కళ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణగాథ. అందుకే దేవుడికి కొబ్బరికాయ కొట్టే ముందు దేవుడ్ని స్మరించుకోవాలి.


Steel Coins : గుండాల్లో చిల్లర నాణాలు వేస్తే నష్టమా…

Kali Matha : కాళీ మాతకు చైనీస్ ఫుడ్

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×