BigTV English

Kali Matha : కాళీ మాతకు చైనీస్ ఫుడ్

Kali Matha : కాళీ మాతకు చైనీస్ ఫుడ్
Kali Matha

Kali Matha : హిందూ సంస్కృతిలో ప్రసాదానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఆచారాల ప్రకారం ప్రసాదాలను తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తితో ప్రసాదాన్ని పెడితే ఏ భగవంతుడైనా స్వీకరిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మాటను కోల్ కతాలో ఓ కాళీ ఆలయంలో బాగా నమ్మినట్టు కనిపిస్తున్నారు. కోల్‌కతాలోని తంగ్రా, మాథేశ్వర్తల రోడ్‌లో ఉన్న ఈ చైనీస్ కాళీ ఆలయంలో నూడుల్స్, చాప్సూయ్, స్టైర్ ఫ్రైడ్ వెజ్జీస్ , మోమోస్‌లను ప్రసాదంగా అందిస్తున్నారు.ఈ ఆలయంలో ఇతర కాళీ దేవాలయాల మాదిరిగా కాకుండా, ఇది దాని ప్రత్యేకమైన ప్రసాదాన్ని సిద్దం చేస్తుంటారు. రెండు దేశాల సంస్కృతుల సమ్మేళనంతో తయారు చేస్తుంటారు.


ఇలా చైనీస్ పుడ్ ను ప్రసాదంగా ఇవ్వడం వెనక పెద్ద రీజనే ఉంది. 1930 లలో చైనాలో జరిగిన అంతర్యుద్ధం సమయంలో చైనా శరణార్థులు పెద్ద ఎత్తున భారతదేశానికి వచ్చిన తరువాత ఈ ఆలయం ఏర్పాటైందని నమ్ముతారు. ఈ వలసదారులు తంగ్రాలో ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని అక్కడ చైనా టౌన్ అంటారు. చైనీయులు ఎక్కువగా ఉన్నప్పటికీ స్థానిక సాంస్కృతిక విలువల ఇబ్బంది లేకుండా దేశీ చైనీస్‌గా ప్రసిద్ధి చెందిన ఇండో-చైనీస్ వంటకాలుగా పిలువబడే అత్యంత ఇష్టపడే వంటకాలను పెట్టడం ప్రారంభించారు.

60 సంవత్సరాల క్రితం ఒక చైనీస్ వలసదారుడకి కాళీ మాత కలలో కనిపించిందట . మాత ఆదేశాల ప్రకారం ఇతర ప్రాంతాల వారితో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. అన్ని ఇతర కాళీ దేవాలయాల మాదిరిగానే ఈ ఆలయం కూడా ఎరుపు మందార పూల దండల నుండి ఎరుపు రంగు వస్త్రాల ఆచారాలను పాటిస్తున్నారు. కానీ ప్రసాదం దగ్గర వచ్చేసరికి పద్దతి మార్చారు. పూజ తర్వాత వడ్డించే సాధారణ ప్రసాదం నైవేద్యాలు కూడా భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా స్వీట్లు, బిస్కెట్లు పువ్వులు సమర్పిస్తారు. అలాగే నూడుల్స్ వంటివి ప్రసాదం ఇస్తుంటారు.


Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×