BigTV English

Alangu that changes the head.. : తలరాతను మార్చే ఆలంగుడి..

Alangu that changes the head.. : తలరాతను మార్చే ఆలంగుడి..

Alangu that changes the head.. : తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో అలంగుడికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈశ్వరుడు కొలువైన ఉన్న ఈ గుడిలో గురుగ్రహ దోష నివారణ పూజల కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. బృహస్పతి లేదా గురు గ్రహం దోషాలను పోగొట్టుకోవడానికి పూజలు చేయడానికి, ప్రతి ఏటా గురువు మారినపుడు కూడా, పెద్ద సంఖ్యలో అలంగుడికి వస్తారు. సకాలంలో వర్షాలు కురువాలంటే ఇక్కడ పూజలు చేస్తే చాలన్న నమ్మకం భక్తులు నమ్ముతుంటారు. అనావృష్టి సమయంలో భక్తులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు. దురదృష్టాన్ని పొగొట్టుకోవడానికి ఎంతో భక్తితో అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర్ ప్రార్ధిస్తారు.


మన్నార్గుడికి సమీపంలోని కుంబకోణం నుండి షుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలంగుడికి సమీపంలోనే కుంబకోణం ఉంది. ఇది బృహస్పతి లేదా గురు గ్రహం ప్రధాన దైవంగా నిర్మించిన నవగ్రహ ఆలయాలలో ఒకటి. అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర్ ఆలయానికి ప్రసిద్ది చెందింది. అలంగుడి చరిత్ర పవిత్ర స్థలమైన శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలో ఆపత్సహాయేశ్వరార్ గా శివుని పూజలందుకుంటున్నాడు. పార్వతీ దేవిని ఏలావర్కుళలి లేదా ఉమై అమ్మాయి అని పిలుస్తారు.

ఒకప్పుడు రాక్షసులు, దేవతలు పాలకడలిని చిలకడానికి ప్రయత్నించారు. అమృతం కోసం వాసుకి అనే పాముని మందర పర్వతానికి తాడువలె చుట్టి లాగారు. ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు పాము వదలిన విషాన్ని మింగాడు. అందువలన, శివుడు ఆ విషం నుండి ప్రపంచాన్ని రక్షించడం వల్ల ఆపత్సహాయేశ్వర్ అంటే రక్షకుడు అని అర్ధం. ఈ ఆలయం సమీపంలోనే నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి.


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×