EPAPER

Sharmila: అన్నను ఛీకొట్టిన పార్టీలో చెల్లి చేరుతుందా?

Sharmila: అన్నను ఛీకొట్టిన పార్టీలో చెల్లి చేరుతుందా?
sharmila-jagan

YS Sharmila latest news today(Telangana news updates): వైఎస్ షర్మిల.. రాజకీయ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయారు. వీరోచితంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. అలాగని వెనకడుగూ వేయలేని దుస్థితి. ఎలా బయటపడాలో అర్థం కాక.. తెగ గింజుకుంటున్నారు. డబ్బులున్నాయని.. తండ్రి పేరుతో పార్టీనైతే పెట్టారు. పాదయాత్రలు, ధర్నాలు, దీక్షలు చేశారు. జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినా, అనుకున్నంత ఆశాజనకంగా మాత్రం పార్టీ ముందుకు సాగడం లేదు. మరి, ఎలా? ఇంత చేశాక.. ఇప్పుడెలా? అందుకే, కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.


కర్నాటక వెళ్లి అక్కడి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను రెండుసార్లు కలిసొచ్చారు. కాంగ్రెస్‌లో విలీనం అంటూ లీకులు వచ్చేలా చేశారు. ఆ తర్వాత తూచ్ అంటూ ఖండించారు. తెలంగాణ కాకపోతే.. ఏపీ పీసీసీ చీఫ్ అయినా అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా, కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీకి బర్త్‌డే విషెష్ చెప్పి.. కమాన్ గుసగుసకు మరింత మసాలా దట్టించారు. ఇంతకీ షర్మిల స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్‌లో పార్టీలో విలీనం.. వ్యూహమా? కన్ఫ్యూజనా?

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ వాళ్లు పరిపాలించడం కోసమేనని.. ఏపీకి చెందిన షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తానంటే ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపడితే సహకరిస్తానంటూ.. షర్మిలను పరోక్షంగా ఏపీకే ఫిక్స్ చేశారు రేవంత్‌రెడ్డి. అయినా, వైఎస్సార్‌టీపీ అధినేత్రి మనసు కాంగ్రెస్ వైపు తెగ లాగేస్తోందని చెప్పడానికి.. రాహుల్ ‌గాంధీకి ఓపెన్‌గా బర్త్ డే విషెష్ చెప్పడమే నిదర్శనం అంటున్నారు.


రేవంత్‌రెడ్డి కాదన్నారంటే.. తెలంగాణ కాంగ్రెస్లో షర్మిలకు పర్మినెంట్‌గా డోర్లు మూసుకుపోయాయన్నట్టే. ఇందులో నో డౌట్. ఇక మిగిలింది ఏపీ కాంగ్రెస్సే. మరి, ఈ తెలంగాణ కోడలు తిరిగి సొంతరాష్ట్రానికి షిఫ్ట్ అవుతారా? జగనన్న మీదకే దండయాత్ర చేస్తారా? ఏపీ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరిస్తారా? ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్.

తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఇప్పటికీ ఊరూరా ఉన్నారు. ఇక్కడైతే వైఎస్సార్ కూతురుగా కాసిన్నైనా ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది. అది పరోక్షంగా కాంగ్రెస్‌కే నష్టం. హస్తం ఓటుబ్యాంకే కొద్దిగానైనా షర్మిల పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఏపీలో అలా కాదు. వైఎస్సార్ కేడర్ అంతా జగన్ వెంట వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికే లేదు. ఇలాంటి సమయంలో షర్మిల.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించినా.. వైఎస్ అభిమానులు జగన్‌ను కాదని.. షర్మిల వైపునకు మళ్లుతారని చెప్పలేం. ఇప్పటికే ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. షర్మిలకు అక్కడ పొలిటికల్ స్పేస్ లేదనే చెప్పాలి. నిజానికి తెలంగాణలో కూడా వైఎస్సార్‌టీపీకి ఛాన్సెస్ శూన్యమే. అయినా, ఏదో తనవంతు ప్రయత్నం చేస్తున్నారు షర్మిల.

ఇక కాంగ్రెస్‌లో చేరడంపైనా అనుమానాలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే గట్టిగా ట్రై చేసింది అప్పటి యూపీఏ సర్కారు. కేంద్రం డైరెక్షన్‌లోనే.. అవినీతి ఆరోపణలతో జగన్‌ను రెండేళ్ల పాటు జైల్లో పెట్టించిందని అంటారు. ఆ సమయంలో జగనన్న వదిలిన బాణాన్నంటూ.. అన్న కోసం షర్మిల ఏపీలో ఓదార్పు యాత్ర కూడా చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు షర్మిల సిద్ధమైనట్టు సంకేతాలు వస్తున్నాయి.

జగన్‌పై ధ్వేషంతో.. షర్మిల హస్తం గూటిలో కలిసిపోతారా? తెలంగాణ కాంగ్రెస్‌లోకి రేవంత్ రానివ్వట్లేదు కాబట్టి.. ఏపీ కాంగ్రెస్‌నైనా చేపట్టి.. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అవుదామని భావిస్తున్నారా? అందుకే, వైఎస్సార్‌కు సన్నిహితుడైన డీకే శివకుమార్‌తో రాయబారం నడిపిస్తున్నారా? రాహుల్‌గాంధీకి శుభాకాంక్షలు చెప్పడం అందులో భాగమేనా? షర్మల టికాంగ్‌లోకి రాకుండా రేవంత్‌రెడ్డి ముందే చెక్ పెట్టారా? చెల్లెమ్మకు ఇక మిగిలింది ఏపీ కాంగ్రెస్ మాత్రమేనా? అన్నయ్యతోనే ఆమెకు పోటీనా? ఇలా షర్మిల ఫ్యూచర్ పాలిటిక్స్‌పై రకరకాల చర్చ నడుస్తోంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×