EPAPER

Viveka Case : వాళ్ల ప్రమేయం ఉంది.. వివేకా కుమార్తె సంచలన వ్యాఖ్యలు..

Viveka Case : వాళ్ల ప్రమేయం ఉంది.. వివేకా కుమార్తె సంచలన వ్యాఖ్యలు..

Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నాలుగేళ్లు పూర్తైంది. ఇప్పటికీ ఈ హత్యకేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేలలేదు. వివేకా కుమార్తె సునీతారెడ్డి చేసిన న్యాయపోరాటంతో ఈ కేసు దర్యాప్తు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యింది. అప్పటి నుంచి సీబీఐ దూకుడు పెంచింది. నిందితులను గుర్తించే పని వేగవంతం చేసింది.


వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగుసార్లు విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అనుమానితుడిగా సీబీఐ భావిస్తోంది. ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఇలా ఈ కేసు తెలంగాణకు బదిలీ అయినప్పటి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి కేంద్రంగా సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తి సహాయకుడు నవీన్ ను సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య తర్వాత వారిద్దరికే అవినాష్ రెడ్డి ఫోన్ చేసినట్లు సీబీఐ గుర్తించింది.

మరోవైపు వైస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీతారెడ్డి నివాళులర్పించారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని స్పష్టం చేశారు.


కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సునీతారెడ్డి ఆరోపించారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించానని తెలిపారు. ఈ హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే కొందరు కుటుంబ సభ్యులపై సీబీఐకు అన్ని విషయాలు తెలియజేస్తున్నానని తేల్చిచెప్పారు. తన తండ్రి హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారని మండిపడ్డారు. కడప, కర్నూలు లాంటి ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు మామూలే కదమ్మా అన్నారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను? అని సునీత నిలదీశారు. వివేకా హత్యలో దోషులెవరో తేలే వరకు పోరాటం చేయడానికే సునీతారెడ్డి సిద్ధమయ్యారని అర్ధమవుతోంది. సీబీఐ దర్యాప్తులో నిజాలు నిగ్గుతేలతాయా..?

Kotamreddy : అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. నమ్మకద్రోహి అంటూ వైసీపీ కౌంటర్..

AP: ఏపీలో నైట్ వాచ్‌మెన్లు.. ఆలస్యంగా పింఛన్లు.. జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. కేబినెట్ కీలక నిర్ణయాలు

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×