EPAPER

Kotamreddy : అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. నమ్మకద్రోహి అంటూ వైసీపీ కౌంటర్..

Kotamreddy : అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. నమ్మకద్రోహి అంటూ వైసీపీ కౌంటర్..

Kotamreddy : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండురోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు. ఈ సమయంలో సభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కోటంరెడ్డి తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. సమస్యలు ఉంటే వినతి పత్రం సభ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలని సూచించారు.


రూల్స్ తెలుసుకోండి: బుగ్గన
వ్యక్తి గత అంశాలకు సభలో చర్చించడానికి అవకాశం లేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తారని సూచించారు. ఎక్కడ ఏ వేదికపై ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు.

అంబటి ఫైర్..
కోటంరెడ్డిపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారని మండిపడ్డారు. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు కోసం పని చేస్తున్నారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్‌రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారని దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి అని చంద్రబాబు మెప్పుకోసం మాట్లాడుతున్నారని అంబటి విమర్శలు గుప్పించారు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు కోటంరెడ్డి నిరసనకు దిగారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. తన నియోజకవర్గంలో‌ని సమస్యలపై ప్లకార్డు ప్రదర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానన్నారు. 4 ఏళ్లు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో అడుగుతూనే ఉంటానన్నారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. అసెంబ్లీకి వెళ్లకుండా తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ ప్లకార్డుతోనే అసెంబ్లీకి కోటంరెడ్డి వెళ్లారు.

మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి రాజధాని రైతులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుపైనా కోటంరెడ్డి స్పందించారు. తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు.

Pawan Kalyan : ఒంటరిగా పోటీకి వెనుకాడం.. పొత్తులపై జనసేనాని క్లారిటీ..

Train : ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టీటీఈ అరెస్టు….

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×