EPAPER

Lokesh: లోకేష్ పాదయాత్రకు అనుమతిచ్చిన పోలీసులు

Lokesh: లోకేష్ పాదయాత్రకు అనుమతిచ్చిన పోలీసులు

Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ పాదయాత్రలో ప్రజలకు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఏపీలో యువగళం పేరుతో 400 రోజులపాటు లోకేష్ పాదయాత్ర సాగనుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం ఇచ్ఛాపురం వరకు మొత్తం 4 వేల కిలోమీటర్లు నడిచేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు. 25న రాత్రి లోకేష్ తిరుమలకు వెళ్లి అక్కడే బస చేస్తారు. 26న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నేరుగా కుప్పం చేరుకుంటారు. అక్కడ శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఈనెల 9న డీజీకీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. అయితే ఈ నెల 20 వరకు డీజీపీ నుంచి స్పందన రాకపోవడంతో మరోసారి లేఖ ద్వారా పాదయాత్ర అనుమతి విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 9న రాసిన లేఖ అందిందని రూట్‌ మ్యాప్‌, కాన్వాయ్‌ వాహనాల జాబితా, పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలివ్వాలని డీజీపీ ఈ నెల 21న మెసెంజర్‌ ద్వారా ఒక లేఖను వర్ల రామయ్యకు పంపారు. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పాదయాత్రలో లోకేష్ ఎంతో మందిని కలుస్తారని.. వారందరి జాబితా ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు.


Avinash Reddy: ఇప్పుడే విచారణకు రాలేను.. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి రియాక్షన్

Pawan Kalyan : పొత్తులపై జనసేనాని క్లారిటీ.. బీజేపీ కాదంటే.. వాళ్లతోనే వెళతాం ..!

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×