BigTV English

Avinash Reddy: ఇప్పుడే విచారణకు రాలేను.. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి రియాక్షన్

Avinash Reddy: ఇప్పుడే విచారణకు రాలేను.. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి రియాక్షన్

Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ జారీ చేసిన నోటీసులపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఒక రోజు ముందు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.


నాలుగు రోజుల పాటు ముందస్తుగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నందు వల్ల హాజరు కాలేనని సీబీఐకి విన్నవించారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని తెలిపారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు.

హత్య కేసులో నా ప్రమేయం ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నాను. తానంటే ఏమిటో ప్రజలకు పూర్తిగా తెలుసని అవినాష్ రెడ్డి అన్నారు. నిజం వెలుగులోకి రావాలి.. న్యాయం గెలవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వారు ఒకసారి ఆలోచించాలని.. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారో ఓ సారి ఊహించుకోవాలన్నారు.


ఇక ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో మొదటి నుంచీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు తుడిచేయించడం, ఆధారాలు ధ్వంసం చేయడం లాంటి చర్యలు చేశారంటూ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. వివేకాను గొడ్డలితో నరికి చంపినా.. శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా.. ఆయన గుండెపోటులో చనిపోయారంటూ అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పడం అప్పట్లో కలకలం రేపింది.

వివేకా కూతురు సునీత సైతం అవినాష్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి సైతం తన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి పేరు ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

CBI: వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు..

Varahi: అంజన్న చెంతకు వారాహి.. పవన్ కు కొండగట్టు సెంటిమెంటు ఎలానంటే..

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×