EPAPER

MLA: దొంగ ఓట్లతోనే గెలిచా.. దొరికేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

MLA: దొంగ ఓట్లతోనే గెలిచా.. దొరికేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

MLA: హోరాహోరీ ఎన్నికలు. ప్రతీ ఒక్క ఓటూ కీలకమే. ఎవరు గెలిచినా బొటాబొటీ మెజార్టీనే. పార్టీ ఓట్లు.. కులం ఓట్లు.. డబ్బులు పంచిన ఓట్లు.. తాయిలాలు ఇచ్చిన ఓట్లు.. ఇలా అభ్యర్థులంతా రకరకాల మార్గాల్లో తమకు ఓట్లు పడేలా ప్రయాస పడుతుంటారు. కానీ, ఆ ఎమ్మెల్యే సంథింగ్ డిఫరెంట్. ఆయన వీటన్నిటితో పాటూ.. దొంగ ఓట్లపైనా డిపెండ్ అయ్యారు. ఆయన తరఫున దొంగ ఓట్లు వేసేందుకు ప్రత్యేకంగా ఓ బ్యాచ్ కూడా మెయిన్‌టెన్ చేశారు. ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఆ టీమ్ రావడం.. తలా ఓ 10 దొంగ ఓట్లు వేసి వెళ్లడం అక్కడ కామన్. ఆ దొంగ ఓట్ల వల్లే.. ఆయన పలు మార్లు గెలిచారు కూడా. ఈ విషయాలన్నీ మరెవరో కాదు.. ఆ ఎమ్మెల్యేనే చెప్పడం సంచలనంగా మారింది. అందులోనూ, ఓ సభలో అంతా వింటుండగా ఈ సంగతులన్నీ చెప్పడం.. ఆ మాటలన్నీ వీడియోలో రికార్డ్ అవడం.. అది కాస్తా వైరల్‌గా మారడంతో.. ఇప్పుడా ఎమ్మెల్యే ఇరకాటంలో పడ్డారు. ఆ వీడియో రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇంతకీ ఆయన ఎవరంటే…


రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. గెలిచింది జనసేన నుంచే అయినా.. ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండిచ్చేసి.. వైసీపీ పంచన చేరారు. అనధికారికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో జరిగిన YSRCP ఆత్మీయ సమ్మేళనంకు హాజరయ్యారు. అక్కడ తన ఫాలోయర్లను చూసి తెగ ఖుషీ అయ్యారు. ఆ సభలోనే ఫుల్‌గా ఓపెన్ అప్ అయి.. తన దొంగ ఓట్ల గూడుపుఠాని గురించి గొప్పలకు పోయారు. అలా ఎరక్కపోయి ఇరుక్కుపోయారు. ఇంతకీ ఎమ్మెల్యే రాపాక ఏమన్నారంటే….

“పూర్వం నుంచి తమ గ్రామం చింతలమోరికి ఓ బ్యాచ్ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారు. ఆ ఓట్లతో తన విజయానికి సహకరించేవారు. 15 నుంచి 20 మంది వచ్చి.. ఒక్కొక్కరూ 5 నుంచి 10కి పైగా ఓట్లు వేసేవారు. వారి వల్ల నాకు 800 పైగానే మెజారిటీ వచ్చేది”.. అంటూ అసలు సంగతి చెప్పేశారు.


రాపోలు చేసిన ఈ కామెంట్లు.. కాస్త ఆలస్యంగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఆటాడుకుంటున్నారు. దొంగ ఓట్లతో గెలిచి.. జనసేన నుంచి గెలిచి.. దొంగలా వేరే పార్టీలో చేరావంటూ.. పోస్టులతో కుమ్మేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు జనసైనికులు. దొంగ నోట్ల సంగతి ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి.. రాపాకపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Smriti Irani: స్మృతి ఇరానీకి అబార్షన్.. ఎవరూ నమ్మట్లే..

Viveka murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశం

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×