BigTV English

Viveka murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశం

Viveka murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశం

Viveka murder case: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎటువంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలను అతి త్వరలో బయటపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.


ఇక ఈ కేసులో దర్యాప్తు కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారిని మార్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పిటిషన్‌పై మార్చి 20న న్యాయస్థానం విచారణ జరిపింది. తిరిగి సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.

సీబీఐ సమర్పించిన స్టేటస్ రిపోర్టులో రాజకీయ వైరం కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు తప్పితే.. విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర గురించిన సమాచారం ఏదీ వెల్లడించలేదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, ఇలా ఇంకెంత కాలం కొనసాగిస్తారని అసహనం వ్యక్తం చేసింది.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×