EPAPER

AP: ఏపీలో రోడ్లు వేస్తున్న ఐప్యాక్!.. అధికారులు అవాక్కు!!

AP: ఏపీలో రోడ్లు వేస్తున్న ఐప్యాక్!.. అధికారులు అవాక్కు!!

AP: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన సమస్య ఏంటి? ఏ ఇష్యూ వల్ల మెజార్టీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు? సీఎం జగన్ మళ్లీ గెలవాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి? ఇలా ఏ ప్రశ్న అడిగినా.. ఎలా తిప్పితిప్పి ప్రశ్నించినా.. వీటన్నిటికీ వచ్చే ఆన్సర్ ఒక్కటే. అదే రోడ్లు.


అవును, ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గుంతలు గుంతలు, కంకర తేలిన రహదారులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ ఊరు వెళ్లినా.. ఎవరిని అడిగినా ఇదే ప్రధాన సమస్యగా చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లొచ్చిన వారంతా చేసే మొదటి కంప్లైంట్.. బాబోయ్ ఆంధ్రాలో రోడ్లు పరమ చెత్తగా ఉన్నాయనే. బస్సులో వెళ్లినా, కారులో వెళ్లొచ్చినా.. ఒళ్లు హూనం అయిందనే సమాధానమే. అంత చెత్తగా ఉన్నాయి ఏపీ రోడ్లు.

అప్పట్లో జనసేన పార్టీ ఏపీ రహదారుల దుస్థితి గురించి కాస్త అలజడి క్రియేట్ చేసినా.. అది మున్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. కొత్త రోడ్లు రాలేదు.. జనం బాధలు తీరలేదు. ఇలాగైతే ఎలా? వచ్చే ఎన్నికలకు వెళ్లేదెలా? ఇదే ప్రశ్న ప్రభుత్వాన్ని సైతం వేధిస్తోంది. రోడ్లు వేయాలంటే భారీగా డబ్బులు కావాలి? సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకే అప్పుల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇక, కొత్త రోడ్లు వేసేదెలా? వేయకపోతే గెలిచేదెలా?


అందుకే, ఎలాగైనా రోడ్లు వేసి తీరాల్సిందేనని జగన్ సర్కారు డిసైడ్ అయిపోయింది. ఎక్కడెక్కడ, ఏయే రోడ్లు వేయాలో కొన్నినెలల క్రితమే అధికారుల నుంచి ప్రతిపాదనలు తెప్పించింది. 6,182 కి.మీ.ల రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు అక్టోబరులో ప్రతిపాదనలు పంపారు. వీటికి రూ.1,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిధులు లేకనో, మరే కారణమో తెలీదు కానీ.. పనులు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. ఇంతలోనే వైసీపీ సలహాదారు ఐ-ప్యాక్ ఎంట్రీ ఇచ్చింది. వచ్చే ఎలక్షన్లలో గెలవాలంటే రోడ్లు వేయాల్సిందేనని సీరియస్ గా చెప్పింది. చెప్పింది ఐప్యాక్ కదా.. అందుకే సీఎం జగన్ సైతం వెంటనే సరే అన్నారు. అయితే, ఇక్కడే మరో ట్విస్ట్.

గతంలో ప్రభుత్వ అధికారులు పంపిన ప్రతిపాదనలను పక్కనపెట్టేశారు. ఏయే చోట్ల రోడ్లు వేయాలో.. ఐప్యాక్ తరఫున ప్రపోజల్స్ ముందుకు తెచ్చారు. ఐప్యాక్ చెప్పిన రోడ్లను మాత్రమే ఇప్పుడు అధికారులు వేయాల్సి ఉంది. ఐ-ప్యాక్‌ బృందం నియోజకవర్గానికి 5 రోడ్లను ఎంపిక చేసింది. వాటి పనులను తక్షణం చేపట్టాలని సూచించింది. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఐ-ప్యాక్‌ బృందం అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేసి.. ఏయే రోడ్లు ఘోరంగా ఉన్నాయనేది స్థానికుల నుంచి తెలుసుకొని వాటి జాబితా తయారు చేసింది. వీటిలో నియోజకవర్గంలో అయిదేసి చొప్పున అత్యంత అధ్వానంగా ఉన్న రహదారుల జాబితాను రెడీ చేసి వైసీపీ పెద్దలకు అందించినట్టు తెలుస్తోంది. 175 నియోజకవర్గాలకు గాను.. 875 రహదారులను ఎంపిక చేసినట్టు సమాచారం. వీటిలో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో 442, పంచాయతీరాజ్‌ శాఖలో 300, పురపాలకశాఖకు చెందిన 133 రోడ్లు ఉన్నాయని చెబుతున్నారు.

ఐ-ప్యాక్‌ బృందం సూచించిన రహదారుల పునరుద్ధరణకు వెంటనే అంచనాలు రూపొందించాలంటూ ఇంజినీర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకోసం వారం రోజుల గడువు ఇచ్చింది. మార్చిలో టెండర్లు నిర్వహించి, ఏప్రిల్‌ నుంచి జూన్‌లోపు పనులు పూర్తిచేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. మరి నిధులో? అంటే బడ్జెట్ లో కేటాయిస్తామని ఇండికేషన్ ఇచ్చారట.

ఏదిఏమైనా.. ఐప్యాక్ పుణ్యాన ఏపీలో కొత్త రోడ్లు వస్తే.. ప్రజలకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. మరి, ఆ రోడ్లు ఓట్లు రాలుస్తాయా? లేదా? అనేది ఎన్నికల్లోనే తెలుస్తుంది.

YCP MLC: ఎట్టకేళకు ‘మర్రి’కి ఎమ్మెల్సీ.. మరి, మంత్రి పదవి? వైసీపీ జాబితా ఇదే..

Kanna Laxminarayana : టీడీపీలో చేరికపై కన్నా క్లారిటీ.. సైకిల్ ఎక్కేందుకు డేట్ ఫిక్స్..

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×