BigTV English

YCP MLC: ఎట్టకేళకు ‘మర్రి’కి ఎమ్మెల్సీ.. మరి, మంత్రి పదవి? వైసీపీ జాబితా ఇదే..

YCP MLC: ఎట్టకేళకు ‘మర్రి’కి ఎమ్మెల్సీ.. మరి, మంత్రి పదవి? వైసీపీ జాబితా ఇదే..

YCP MLC: ఏపీలో ఎమ్మెల్సీ జాతరొచ్చింది. ఎమ్మెల్సీ అనగానే వెంటనే వినిపించే పేరు మర్రి రాజశేఖర్. ఐదేళ్లుగా ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా.. మర్రికి ఛాన్స్ ఇచ్చారా? అనే చర్చే నడిచేది. ఇప్పుడు కూడా మళ్లీ ఆయన పేరే ఆసక్తి రేపింది. పలుమార్లు మర్రికి మొండిచేయి ఇచ్చిన జగన్.. ఈసారి మాత్రం మాట నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యేల కోటాలో పల్నాడు నుంచి మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ.


మర్రి రాజశేఖర్ కు ఎప్పుడో ఎమ్మెల్సీ రావాల్సింది. గత ఎన్నికల్లో చిలుకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ మర్రికే ఇవ్వాల్సింది. కానీ, విడదల రజనీ ఎగరేసుకుపోయారు. రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేస్తానని బుజ్జగించారు. మంత్రి పదవి కూడా ఇస్తానని అప్పట్లో సీఎం జగన్ బహిరంగ వేదిక మీదే హామీ ఇచ్చారు. కానీ, రెండుసార్లు ఆ ప్రామిస్ ను తూచ్ అనిపించారు. ఇదే లాస్ట్ ఛాన్స్ కావడంతో.. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో.. ఈ దఫా మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ కన్ఫామ్ చేశారు. లేట్ గా అయినా.. లేటెస్ట్ గా మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి, చెప్పినట్టుగానే మంత్రి పదవి కూడా ఇస్తారా?

ఇక, ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది వైసీపీ. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు. సామాజిక సాధికారిత అంటే వైసీపీదే అన్నారు సజ్జల. చంద్రబాబు మాటలు చెబితే తాము చేతల్లో చూపించామని చెప్పారు.


వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఎమ్మెల్యే కోటాలో..

మర్రి రాజశేఖర్‌.. గుంటూరు (కమ్మ)

పోతుల సునీత.. ప్రకాశం (బీసీ- పద్మశాలి)

పెనుమత్స సూర్యనారాయణ.. విజయనగరం (క్షత్రియ సామాజిక వర్గం)

కోలా గురువులు.. విశాఖ (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌)

బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూర్పు గోదావరి ( ఎస్సీ-మాదిగ)

జయమంగళ వెంకటరమణ.. పశ్చిమ గోదావరి (వడ్డీల సామాజిక వర్గం)

ఏసు రత్నం.. గుంటూరు ( బీసీ-వడ్డెర)

స్థానిక సంస్థల కోటాలో..

రామసుబ్బారెడ్డి.. కడప (ఓసీ-రెడ్డి)

వంకా రవీంద్రనాథ్‌.. పశ్చిమ గోదావరి (పారిశ్రామికవేత్త)

కవురు శ్రీనివాస్‌.. పశ్చిమ గోదావరి ( బీసీ-శెట్టి బలిజ)

కుడుపూడి సూర్యనారాయణ.. తూర్పు గోదావరి (బీసీ-శెట్టి బలిజ)

నత్తు రామారావు.. శ్రీకాకుళం (బీసీ, యాదవ)

మేరుగ మురళి.. నెల్లూరు (ఎస్సీ-మాల)

డా. సిపాయి సుబ్రహ్మణ్యం.. చిత్తూరు

డాక్టర్‌ మధుసూదన్‌.. కర్నూలు (బీసీ-బోయ)

ఎస్‌. మంగమ్మ.. అనంతపురం( బీసీ-బోయ)

గవర్నర్‌ కోటా..

కర్రి పద్మశ్రీ.. కాకినాడ (బీసీ)

కుంభా రవి.. అల్లూరి జిల్లా (ఎస్టీ)

Kanna Laxminarayana : టీడీపీలో చేరికపై కన్నా క్లారిటీ.. సైకిల్ ఎక్కేందుకు డేట్ ఫిక్స్..

AP: ఏపీలో రోడ్లు వేస్తున్న ఐప్యాక్!.. అధికారులు అవాక్కు!!

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×