EPAPER
Kirrak Couples Episode 1

Telangana: పరీక్షలకే పరీక్ష.. సిగ్గు సిగ్గు..

Telangana: పరీక్షలకే పరీక్ష.. సిగ్గు సిగ్గు..

Telangana News Updates: ఎక్కడైనా చూశామా? ఎప్పుడైనా విన్నామా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌, సెక్రటరీ, మెంబర్‌, ఎంప్లాయిస్‌ను పోలీసులు విచారించడం? ఇంతకంటే దారుణం ఇంకేంటి? సిగ్గు కాకపోతే మరేంటి? చరిత్రలోనే బహుషా ఇదే మొదటిసారి కాబోలు.


అవి పరీక్షా పత్రాలా? పప్పుబెల్లాలా? అంగటి సరుకులా అలా అడ్డగోలుగా అమ్మేసుకోవడం ఏంటి? అందులోనూ అందులో పనిచేసే ఉద్యోగులే ఇలా బరితెగించడాన్ని ఎలా భరించాలి? బావ కోసం ఓ పేపర్.. ఊరోళ్ల కోసం ఇంకో పేపర్.. డబ్బుల కోసం మరో పేపర్.. ఇలా ఇష్టారీతిగా TSPSC పేపర్లు అమ్ముకోవడం మామూలు విషయమా?

అదేంటి? అంత సింపుల్‌గా పేపర్లు ఎలా కొట్టేశారు? ఆన్‌లైన్లో చెప్పులు కొంటేనే ఓటీపీ అడుగుతుందో.. అలాంటిది కాన్ఫిడెన్షియల్ రూమ్‌లో నుంచి 15 ప్రశ్నాపత్రాలు దొంగిలించడం ఎంత దారుణం? ఎలాంటి సెక్యూరిటీ మెజర్‌మెంట్స్ తీసుకోలేదు.. ఎక్కడ త్రీ స్టెప్ వెరిఫికేషన్ లేదు.. జస్ట్ ఓ పాస్‌వర్డ్ పడేసి.. అదికూడా వారి దగ్గరే ఉంచేసి.. చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. ఫలితం.. ఐదు పరీక్షలు రద్దు కావడం.. లక్షలాది మంది లబోదిబోమంటూ మొత్తుకోవడం.


చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. ఇప్పుడు సిట్ హడావుడి చేస్తుంటే ఏం ప్రయోజనం? TSPSC ఛైర్మన్‌కు మంచి బ్యాక్‌గ్రౌండే ఉండొచ్చు. అయితే? కమిషన్ ఉద్యోగులు పరీక్ష రాయొద్దని నిబంధనలు ఉన్నా.. వారిని ఎలా అనుమతిస్తారు? ఓ సభ్యుడి పీఏనే పరీక్ష ఎలా రాస్తాడు? ఇంత జరుగుతుంటే ఛైర్మన్, సెక్రటరీ ఏం చేస్తున్నారు? కనీసం పాలకులైనా పట్టించుకున్నారా? అన్ని నోటిఫికేషన్లు ఇచ్చామంటున్నారే.. ఓ రివ్యూ మీటింగ్ అయినా పెట్టారా? పెట్టుంటే.. సమీక్ష చేసుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? అయినా, కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏంటి? వారి అడ్డగోలు నియామకాలేంటి?

పాపం.. నిరుద్యోగులు. అప్పు చేసి కొందరు, జాబులు వదిలేసి మరికొందరు, ఆస్తులు తాకట్టు పెట్టి ఇంకొందరు.. పస్తులుంటూ.. నానా అవస్థలు పడుతూ.. నెలలు, ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరీక్ష రాశాక.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఉంటారు. ఇప్పుడు అంతా తూచ్.. పేపర్ లీక్ అయింది.. ఆ ఎగ్జామ్ రద్దు అయింది.. మళ్లీ పెడతాం.. అంటే అయిపోతుందా? నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన నిరుద్యోగులు మళ్లీ సన్నద్దమవడం ఎంత కష్టం? ఎంత నష్టం?

ఓవైపు TSPSC పేపర్ లీక్ ఘటన ప్రకంపణలు రేపుతుంటో.. లేటెస్ట్‌గా పదో తరగతి పరీక్ష పత్రం లీక్ అవడం మరింత కలకలం. మొదటి పరీక్షకే.. మొదటి 7 నిమిషాల్లోనే.. పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం దారుణం. అందులోనూ ఆ పేపర్ లీక్ చేసింది కూడా బుద్ధిలేని ఓ బడిపంతులే. టీచర్ బందెప్ప గతంలోనూ ఇలాంటి వెదవ పనే చేశాడట. అప్పట్లో పోక్సో కేసు కూడా పెట్టారట. అయినా, ఆయనకు మళ్లీ అదే డ్యూటీ వేయడాన్ని ఏమనాలి? వేసినోళ్లను ఏం చేయాలి? అసలు SSC బోర్డుకు పూర్తిస్థాయి డైరెక్టర్‌నే నియమించలేదంటే ఈ పాలకులకు విద్యార్థుల మీద, పరీక్షల మీద ఎంత ప్రేముందో తెలిస్తోంది. ఈ కేసులో నలుగురిని సస్పెండ్ చేశారు కానీ.. మరో పరీక్షాపత్రం లీక్ కాదనే గ్యారంటీ ఇవ్వగలదా ఈ ప్రభుత్వం.

ఇలా అన్నికోణాల్లో ఆలోచిస్తే.. పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మామూలుది కాదు. అందుకు బాధులైన వారు శిక్ష అనుభవించాల్సిందే. మరోసారి ఇలా జరగబోదని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సిందే. మొత్తం పరిణామాలకు ప్రభుత్వం, అధికారులు సిగ్గు పడాల్సిందే.

Related News

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Big Stories

×