EPAPER

Rajamouly: జక్కన్నకే ‘ఆస్కార్’.. ది మాస్టర్ మైండ్.. అంతకుమించి..

Rajamouly: జక్కన్నకే ‘ఆస్కార్’.. ది మాస్టర్ మైండ్.. అంతకుమించి..

Rajamouly: నాటు నాటుకు ఆస్కార్. యావత్ దేశం గర్వపడుతోంది. ఇండియన్ సినిమా సంబరాలు చేసుకుంటోంది. RRR టీమ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, తారక్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్‌, కాలభైరవ, రాహుల్‌ల పనితనానికి పరిశ్రమ ఫిదా అవుతోంది. ప్రపంచమంతా ఇప్పుడు ‘నాటు నాటు’ చర్చ.


నాటు నాటు సాంగ్ అద్భుతంగా ఉంది, అందుకే ఆస్కార్ అవార్డు వరించింది..అని సింపుల్‌గా చెప్పేయలేం. ఇది నాటు నాటుకు వచ్చిన అవార్డు అనడంకంటే.. రాజమౌళి కృషికి దక్కిన ఫలితమని భావించాల్సి ఉంటుంది. సాంగ్ క్రియేషన్‌తో పాటు ఆస్కార్ అవార్డు వచ్చే వరకూ.. కర్త, కర్మ, క్రియ.. అంతా జక్కన్నే.

దశాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ సినిమా. ఏటేటా వేలాది చిత్రాలు. ఇప్పటివరకూ లక్షలాది మూవీలు. వీటిలో వేటికీ సాధ్యంకాని అరుదైన ఘనత ఆర్ఆర్ఆర్ సాధించింది. ఇండియన్ సినిమాకు ఇప్పటి వరకు వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే ఆస్కార్‌లు రాగా.. అందులో మన తెలుగు చిత్రం కూడా నిలవడం మనజాతి నిండు గౌరవం. ఈ సందర్భంగా జక్కన్నకు హ్యాట్సాఫ్ చేయాల్సిందే. థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.


దేశంలో అనేక మంచి సినిమాలు వచ్చాయి. అనేక మంది మంచి దర్శకులు, నటులు ఉన్నారు. సౌత్‌లో కమల్‌ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, చిరంజీవిలాంటి హైలీ టాలెంటెడ్ యాక్టర్స్‌కు కొదవే లేదు. మణిరత్నం, శంకర్ లాంటి హేమాహేమీ దర్శకులు దక్షిణాది సినిమా స్థాయిని ఘనంగా చాటారు. అర్జున్‌రెడ్డి, కేజీఎఫ్, కాంతారాలాంటి సినిమాలతో యంగ్ డైరెక్టర్లు సౌత్ ఇండస్ట్రీ స్టామినాను అమాంతం పెంచేశారు. వీరందరిలోకి సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్.. మన ఎస్.ఎస్.రాజమౌళి. జక్కన్న మంచి సినిమాలు తీయడమే కాదు.. అంతకుమించి అనిపించారు.

సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. బాహుబలి బ్లాక్ బస్టర్‌తో RRRకు రిలీజ్‌కి ముందే పాన్ ఇండియా వైజ్ క్రేజ్ వచ్చింది. ప్రీరిలీజ్ కోసం దేశమంతా తిరిగింది జక్కన్న అండ్ టీమ్. అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు, ప్రెస్‌మీట్లతో ఫుల్ హైప్ తీసుకొచ్చారు. విడుదలకు ముందే పూర్తిస్థాయి బిజినెస్ చేసేశారు. సినిమా బాగుందని ఫస్ట్ షోతోనే తేలిపోవడంతో.. ఇక తిరుగులేకుండా పోయింది. బాలీవుడ్ రికార్డులు బద్దలయ్యాయి. ఇదంతా కమర్షియల్ విజయం. ఎవరైనా అక్కడితో సంతోష పడిపోతారు.. మనం గ్రేట్ అనుకొని ఆగిపోతారు. కానీ, రాజమౌళి అలా కాదు. అందరిలాంటి వారు అసలే కాదు.

RRRని చైనాలో వదిలారు. కాసులు కొల్లగొట్టారు. జపాన్‌లో రిలీజ్ చేసి దిమ్మ తిరిగేలా చేశారు. వాట్ నెక్ట్స్? అనుకుంటుండగానే ఆస్కార్ రేసులోకి దిగారు. భారత ప్రభుత్వం అధికారికంగా ఆర్ఆర్ఆర్‌ను నామినేట్ చేయలేదు. అయితేనేం. ఏమాత్రం నిరుత్సాహపడకుండా సొంతంగా ఆస్కార్ పోటీకి సై అన్నారు. జక్కన్నే పక్కా ప్లాన్డ్‌గా పావులు కదిపారు.

అమెరికాలో గ్రాండ్ రీరిలీజ్ చేయడం.. ఆస్కార్‌కు ముందడుగులా గోల్డెన్ గ్లోబ్ సాధించడం.. యూఎస్ మీడియాకు ఇంటర్వ్యూలు.. హాలీవుడ్ ప్రముఖులకు ఆర్ఆర్ఆర్ చూపించడం.. ఇలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లారు. ఆస్కార్ ప్రమోషన్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తమ్మారెడ్డి లాంటి వాళ్లు అన్నా.. ఆస్కార్ అవార్డు తీసుకొచ్చే ఇమేజ్, బిజినెస్.. అందుకు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో.. ఆ లెక్క ఒక్క రాజమౌళికే తెలుసు.

నాటు నాటు సాంగ్ క్రేజ్‌కి.. జక్కన్న కృషి, స్ట్రాటజీ జతకలవడంతో.. ఆస్కార్‌తో అంతులేని ఆనందం సొంతమైంది. రాజమౌళి నేర్పరితనం.. 130 కోట్ల భారతీయుల ఆస్కార్ స్వప్నాన్ని సాకారం చేసింది. హాలీవుడ్‌కి ఇండియన్ మూవీ గొప్పతనాన్ని, తెలుగు సినిమా సత్తాని ఘనంగా చాటింది. దటీజ్ రాజమౌళి. ది రియల్ ఆస్కార్ విన్నర్. జయహో జక్కన్న.

Oscar Awards : ఆస్కార్ లైవ్ స్ట్రీమింగ్ రికార్డ్.. టాప్ లో RRR, NTR ..

Rain: అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం..

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×