EPAPER

Kiss Day special: ప్రేమికులను మరింత దగ్గర చేసే కిస్ డే..

Kiss Day special: ప్రేమికులను మరింత దగ్గర చేసే కిస్ డే..
Kiss Day special

ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అని అంటూ ఉంటారు. మరి అలాంటి ఫీలింగ్‌ను అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం ఎలా..? గిఫ్ట్స్ ఇవ్వడం, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం.. ఇవన్నీ ప్రేమను చూపించడానికే.. కానీ అంతకంటే ఎక్కువగా ప్రేమను ఎక్కువగా అర్థమయ్యేలా చెప్పేది స్పర్శే అంటున్నారు ప్రేమికులు. అలాంటి ఒక అందమైన స్పర్శే ముద్దు. ఆ స్పర్శను సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ స్పెషల్ డే.. ‘హ్యాపీ కిస్ డే’.


మొదటి ప్రేమ, మొదటి స్పర్శ, మొదటి ముద్దు.. ఇలాంటివి అందరి జీవితాల్లో మర్చిపోలేని క్షణాలు అని అందరూ అంటుంటారు. అందుకే ఈ మొదటి క్షణాలను ఒక్కొక్కటిగా సెలబ్రేట్ చేసుకోవడానికేనేమో వాలెంటైన్స్ వీక్‌లో ప్రతీరోజు ఒక స్పెషల్‌ డేగా చెప్పుకోబడుతుంది. ఇక కిస్ అనేది ఒక కెమికల్ రియాక్షన్ లాంటిదని, ప్రేమించిన వ్యక్తి నుండి అది పొందగానే మెదడు పరుగులు తీస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిపుణులు బయటపెట్టారు. అంతే కాకుండా ఒక్కో ముద్దుకు ఒక్కొక్క అర్థం ఉంటుందని ప్రేమికులు అంటున్నారు. అందుకేనేమో ముద్దు గురించి అందంగా వర్ణిస్తూ.. కవులు, రచయితలు పాటలను, కవిత్వాలను రాశారు.

మనం ప్రేమించే వ్యక్తి నుండి అందుకునే నుదుటిపై ముద్దు మాటల్లో చెప్పలేనంత అందమైనది అని ప్రేమికులు చెప్తుంటారు. దీనిని చాలావరకు జంటలు సమ్మతించాయి కూడా. ఆ కిస్ అంత స్వచ్ఛమైనది మరొకటి ఉండదని వారు అంటున్నారు. ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ వచ్చినప్పుడు దానిని మాటల్లో చెప్పలేనప్పుడు.. నుదుటిపై ముద్దే దానికి పరిష్కారమని వారు చెప్తున్నారు.


చేతిపై ఇచ్చే ముద్దులో ఒక గౌరవం ఉంటుందని కపుల్స్ అంటున్నారు. నీతో జీవితాంతం కలిసి ఉండడం నాకు ఇష్టమే అని చెప్పడానికి ఇది సూచనగా భావిస్తున్నారు. చేతిలో చేయి వేసి ప్రేమించిన మనిషి నడిపించినప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో.. చేయిపై కిస్ చేసినప్పుడు కూడా అదే భరోసా కనిపిస్తుందంటున్నారు లవర్స్. ఇలా ప్రేమికులు తమరు ప్రేమించిన వ్యక్తికి ముద్దుతో తమ ప్రేమను తెలియజేస్తూ ఈ కిస్ డేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి.

Tags

Related News

SSMB29: మహేష్ కాబట్టే కథ లేట్ అయ్యింది.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Vettaiyan The Hunter: తెలుగులో వెట్టయన్ బ్యాన్.. స్పందించిన లైకా

Pushpa 2 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’.. బ్రేక్‌ ఈవెన్‌కి ఆ సినిమాను క్రాష్ చేయాల్సిందే..!!

Rajinikanth: 33 ఏళ్ల తర్వాత మరోసారి.. ఎవర్‌గ్రీన్ కాంబో ఈజ్ బ్యాక్

T.P.Madhavan: ప్రముఖ నటుడు టీపీ మాధవన్ మృతి..

NBK 109: బాలయ్య ఫ్యాన్స్ కు దసరా ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్ కు పండగే..

Maheshwari: శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఆమె చెల్లెలు మహేశ్వరి ఏం చెప్పిందంటే..?

Big Stories

×