E-Paper
Advertisement

Promise day:- ప్రేమతో ప్రామిస్‌లను సెలబ్రేట్ చేసుకోవడం కోసం..

Promise day:- ప్రేమతో ప్రామిస్‌లను సెలబ్రేట్ చేసుకోవడం కోసం..

promise day special in valentine week:- ‘నీకొక సీక్రెట్ చెప్తా.. ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయి’.. ఈ మాట చిన్నప్పుడు చాలామంది ఉపయోగించే ఉంటారు. అప్పట్లో ప్రామిస్‌కు పూర్తి అర్థం కూడా తెలియదు. అయినా ఈ మాట తరచుగా ఉపయోగించేవాళ్లం. పెద్దయ్యాక అర్థమయ్యింది ప్రామిస్ అనేది చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటను నిలబెట్టుకోవాలి అని. ఏ విషయంలో అయినా.. ప్రామిస్ ప్రామిస్సే.. అలాంటి ప్రామిస్ రిలేషన్‌షిప్స్‌లో కూడా చాలా ముఖ్యం. ఆ ప్రామిస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికే ‘ప్రామిస్ డే’ అనేది ప్రారంభమయ్యింది.

రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చేసే ప్రతీ పనిలో ప్రేమ ఉంటుంది అంటారు. ‘త్వరగా వచ్చేస్తా.. లేట్ చేయను’ అని బాయ్‌ఫ్రెండ్ చేసే ప్రామిస్‌లో, ‘టైమ్‌కు కచ్చితంగా తింటాను’ అని లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ చేసే ప్రామిస్‌లో ఉన్న అవతల మనిషిపై ప్రేమే కనిపిస్తుంది. ‘అంతెందుకు పెళ్లికి ముందు ఎన్ని ప్రామిస్‌లు చేశావ్.. అవన్నీ అస్సలు బ్రేక్ చేయను’ అని మాటివ్వు అని అలిగిన భార్య.. తన భర్త చేత చేయించుకునే ప్రామిస్‌లో కూడా బోలెడంత ప్రేమ ఉంటుందని ప్రేమికులు ఎప్పుడూ చెప్తుంటారు.

ప్రేమలో ప్రతీ చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకేనేమో జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని చేసుకున్న ప్రామిస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఒకరోజు ఉంది. మిగతా విషయాలతో పోలిస్తే.. ప్రేమలో చేసే ప్రామిస్ చాలా సెన్సిటివ్. ప్రామిస్ అనేది బ్రేక్ అయితే.. రిలేషిప్‌లో మనిషి హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

చిన్నప్పుడు ప్రామిస్ అనగానే అవతల మనిషి ఆలోచించకుండా నమ్మేసేవారు. కానీ ఇప్పుడు అబద్ధాన్ని నిజంగా నమ్మించడం కోసం కూడా చాలామంది ఈ పదాన్ని ఉపయోగించడంతో.. దీనికి ఉన్న వాల్యూ చాలా తగ్గిపోయింది. అందులోనూ ఒకసారి హార్ట్ బ్రేక్ అయిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ.. ప్రామిస్ అనే పదాన్ని మళ్లీ నమ్మడానికి కూడా భయపడుతున్నారు. అందుకే ప్రేమలో చేసే కొన్ని ప్రామిస్‌లు మాత్రమే చివరి వరకు వెళ్లి దానిపై నమ్మకాన్ని నిలబెడుతున్నాయి. అందుకే ప్రేమించిన వారికి చేసిన ప్రామిస్‌ను కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే సరైన సందర్భం.

Follow this link for more updates:- Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×