BigTV English

Teddy Day Special : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. టెడ్డీలతో ప్రేమను తెలపండి..!

Teddy Day Special : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. టెడ్డీలతో ప్రేమను తెలపండి..!
Teddy day

Valentine’s week: Today is Teddy Day

‘వావ్.. టెడ్డీనా థాంక్యూ సో మచ్’.. అని టెడ్డీని గిఫ్ట్‌గా తీసుకున్న ఒక ప్రియురాలు తన ప్రియుడితో నవ్వుతూ చెప్పింది. ‘మళ్లీ టెడ్డీనా? ఇప్పటికీ మన రిలేషన్ స్టార్ట్ అయ్యి మూడేళ్లు అయ్యింది. ఇది నువ్వు నాకిస్తున్న మూడో టెడ్డీ’ అని మరో ప్రియురాలు తన ప్రియుడిపై అసహనం చూపించినా.. ఆ అబ్బాయి ఇచ్చిన టెడ్డీని మాత్రం ఇష్టంగా దగ్గరకు తీసుకుంది. ‘ఎంతైనా టెడ్డీ డే స్పెషల్ కదా!’ అని తనకు తానుగా టెడ్డీని గిఫ్ట్ ఇచ్చుకున్న అమ్మాయి మనసులో అనుకుంది.


ఇలా సందర్భాలు వేరే అయినా.. టెడ్డీపై అమ్మాయిలు చూపించే ఎమోషన్ మాత్రం ఒకటే. మామూలుగా బాయ్‌ఫ్రెండ్.. గర్ల్‌ఫ్రెండ్‌కు ఇవ్వడానికి ఎన్నో గిఫ్ట్స్‌ ఉన్నా కూడా టెడ్డీ మాత్రమే ఎప్పటికీ స్పెషలే. అందుకేనేమో ప్రేమికులు ఇష్టంగా జరుపుకునే ఈ వాలెంటైన్స్ వీక్‌లో టెడ్డీని గిఫ్ట్‌గా ఇచ్చుకోవడానికి ఒక రోజునే కేటాయించారు. అదే టెడ్డీ డే.

అలా అని అందరు అమ్మాయిలకు టెడ్డీలు అంటే చాలా ఇష్టముండాలి అని రూల్ ఏమీ లేదు. అందుకే కొందరు అమ్మాయిలు గిఫ్ట్స్‌కు ఇంప్రెస్ అవ్వరు. అలాంటి వారు సింపుల్‌గా ఒక చాక్లెట్ ఇస్తే.. ఇంప్రెస్ అయిపోతారు. అలాంటి వారికోసమే ఈ వాలెంటైన్స్ వీక్‌లో చాక్లెట్ డే కూడా ఉంది. మొత్తానికి వాలెంటైన్స్ వీక్ అనేది గర్ల్‌ఫ్రెండ్‌ను బాయ్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్‌ను గర్ల్‌ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి క్రియేట్ చేశారు అని నెగిటివ్‌గా మాట్లాడేవారు కూడా ఉన్నారు.


అలాంటి నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోకుండా సోషల్ మీడియా అంతా లవ్ పోస్టులతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ప్రేమికులంతా సోషల్ మీడియా వేదికగా తమ లవ్ స్టోరీలను బయటపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమ ఫేవరెట్ పర్సన్‌తో ట్రిప్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. వాలెంటైన్స్ వీక్ మొదలయినప్పటి నుండి ప్రపంచమంతా అందంగా మారిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రేమికులు.

ఇక టెడ్డీ డే రోజు టెడ్డీని గిఫ్ట్‌గా అందుకోవడానికి కొందరు అమ్మాయిలు ఎదురుచూస్తుంటే.. ప్రతీసారి అబ్బాయిలే టెడ్డీలు ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి అని డిఫరెంట్‌గా ఆలోచించేవారు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ వాలెంటైన్ వీక్‌లో టెడ్డీ డే మొత్తం టెడ్డీమయం కానుంది. చివరిగా ఈ టెడ్డీ డేను తమ స్పెషల్ టెడ్డీస్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేమికులందరికీ ‘హ్యాపీ టెడ్డీ డే’.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×