BigTV English

Happy Hug Day : ఒక్క హగ్.. భయం, బాధ మటుమాయం..!

Happy Hug Day : ఒక్క హగ్.. భయం, బాధ మటుమాయం..!

Happy Hug Day : నీకు నేను ఉన్నాను. నీ బాధలో, సంతోషంలో తోడుగా ఉంటాను.. అని ప్రేమికులు మాటల్లో చెప్పుకోలేని పరిస్థితిల్లోనే హగ్ అనేది వారికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలిసేలా చేస్తుంది. మాటల్లో చెప్పలేని ఫీలింగ్‌ను అవతల వ్యక్తికి తెలిసేలా చేస్తుంది కాబట్టే ఈ హగ్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి వాలెంటైన్స్ వీక్‌లో ప్రత్యేకంగా ఒకరోజే ఉంది. అదే ‘హగ్ డే’.


ప్రేమలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి బాధలో ఉన్నారని అర్థమయినప్పుడు మాటలు ఇవ్వలేని ఎంతో రిలీఫ్‌ను ఒక్క హగ్ ఇస్తుంది అంటారు. అందుకేనేమో దీనిని సెలబ్రేట్ చేసుకోవడం ముఖ్యమని వారి భావన. హగ్ అనేది కేవలం ఒక వ్యక్తి బాధను పోగొట్టడమే కాదు.. మళ్లీ వారు సంతోషంగా ఉండేలాగా కూడా చేస్తుంది. హగ్ అనేది ఎన్నో విధాలుగా ఒక మనిషిని శారీరికంగా, మానసికంగా సంతోషంగా ఉంచగలుగుతుందని సైన్స్ కూడా చెప్తోంది.

స్ట్రెస్‌ను తగ్గించే హగ్..
ప్రేమించిన వారు ఎంతో స్ట్రెస్‌లో ఉన్నప్పుడు.. అసలు ఏమైంది, ఏంటి అని వివరాలు అడగకుండా.. ముందుగా ఒక హగ్ ఇస్తే.. ఆటోమాటిక్‌గా వారి స్ట్రెస్ మాయమైపోతుందని ప్రేమికులు చెప్తున్నారు. దీనికి సైంటిఫిక్ ప్రూవ్ ఏంటంటే.. హగ్ చేసుకున్నప్పుడు శరీరంలోని కార్టిసాల్ లెవల్స్ తగ్గిపోయి.. కాస్త రిలీఫ్‌గా ఉంటుంది.


ఇమ్యూనిటీని పెంచే హగ్..
బాధలో ఉన్నప్పుడు ఒక్క హగ్ ఆ బాధను పోగొడుతుంది. అదే సమయంలో అది ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. హగ్ వల్ల లిమ్ఫోసైట్స్‌తో మరెన్నో ఇమ్యూనిటీ బూస్టింగ్ సెల్స్ కూడా మెరుగుపడతాయి. అందుకే హగ్ అనేది బాధను తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుందని సైన్స్ అంటోంది.

కనెక్షన్ పెంచే హగ్..
ఒక మాట ఇద్దరి మనుషులు పరిచయం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒక షేక్‌హ్యాండ్ ఇద్దరిని ఫ్రెండ్స్‌ను చేయగలుగుతుంది. అలాగే ఒక హగ్.. ఇద్దరి మధ్య బాండింగ్‌ను, కనెక్షన్‌ను పెంచుతుంది. చాలారోజుల తర్వాత కలిసిన ప్రేమికులు ఇచ్చుకునే హగ్.. వారు ఒకరిని ఒకరు ఎంత మిస్ అయ్యారో అన్న విషయాన్ని చెప్పడంతో పాటు వారి మధ్య కనెక్షన్‌ను మరింత పెంచుతుంది.

భయాన్ని పోగొట్టే హగ్..
హగ్ అనేది బాధను మాత్రమే కాదు.. భయాన్ని కూడా పోగొడుతుంది. ఒకరు ఏదైనా విషయంలో భయపడుతున్నప్పుడు.. భయపడకు.. నేను ఇక్కడే ఉన్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది హగ్. ఇది ఒకరిని ఒంటరిగా లేరనే ఫీలింగ్ ఇస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్‌తో బాధపడే వారికి, ఆత్మ స్థైర్యం లేని వారికి ఇచ్చే ఒక్క హగ్.. వారిలో కొండంత ధైర్యాన్ని నింపుతుందని సైన్స్ చెప్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×