కృతిమ మేధస్సు (ఏఐ)పై ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఒకవైపు ఈ పరిశోధనలు జరుగుతుండగానే మరోవైపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి పరీక్షలు చేస్తున్నారు మరికొందరు. అందులో భాగంగానే 2021 జూన్‌లో నేషనల్ ఆర్టిఫిషియల్ రీసెర్చ రిసౌర్స్ (నైర్ర్) టాస్క్ ఫోర్స్ ఏర్పాటయ్యింది. తాజాగా కృత్రిమ మేధస్సుపై ఈ టాస్క్ ఫోర్స్ ఓ ఫైనల్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.
నైర్ర్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక అడ్వైజరీ కమిటీ. 2020లో నేషనల్ ఏఐ ఇనిషియేటివ్ యాక్ట్ అనేది ప్రారంభమైన తర్వాత దీని ఏర్పాటు జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కనుగొన్న విషయాలపై ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా యాక్సెస్ ఉంటుంది. ఇటీవల ఈ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన ఫైనల్ రిపోర్ట్‌లో ప్రజల దగ్గర నుండి కూడా కొంత సమాచారాన్ని పొందుపరిచింది. ఫైనల్ రిపోర్ట్ తయారైన తర్వాత 11 పబ్లిక్ మీటింగ్‌లు జరిగాయి. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ బయటికొచ్చింది.
కృత్రిమ మేధస్సుపై సమాచారాన్ని బయటికి రానివ్వాలా వద్దా అనే అనుమానం శాస్త్రవేత్తల మధ్యే కాదు.. ప్రభుత్వాలలో కూడా ఉంది. అయితే దీనికి సమాధానాన్ని టాస్క్ ఫోర్స్ ఈ ఫైనల్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఏఐ రిసెర్చ్ డెవలెప్‌మెంట్ గురించి అందరికీ తెలియడం వల్ల దానిపై పనిచేసే పరిశోధకులకు కూడా కొత్త ఐడియాలు వచ్చే అవకాశం ఉంటుందని, అది మంచిదే అని వారు తెలిపారు. దీని వల్ల టెక్నాలజీ రంగంలో కూడా హెల్తీ పోటీ మొదలవుతుందని వారు అన్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఏఐపై పరిశోధనలు ఊపందుకున్నాయి. కానీ ఏఐపై ఏర్పాటు చేస్తున్న కొత్త అప్లికేషన్స్‌పై పరిశోధకులకు, సైన్స్ స్టూడెంట్స్‌కు ఎవరికీ యాక్సెస్ లేదు. నైర్ర్ టాస్క్ ఫోర్స్ ఈ పద్ధతిని మార్చనుంది. అందరికీ ఏఐ పరిశోధనల గురించి సమాచారం అందించనుంది. అంతే కాకుండా వారు వ్యక్తిగతంగా పరిశోధనలు నిర్వహించడానికి సహాయం చేయనుంది. అయితే ఈ రిపోర్ట్‌ను అమెరికా ప్రభుత్వం ఎలా స్వీకరించనుందో చూడాలి.