BigTV English
Advertisement

Virtual Technology : పిల్లలకు ఆరోగ్యాన్ని కాపాడే వర్చువల్ టెక్నాలజీ..

Virtual Technology : పిల్లలకు ఆరోగ్యాన్ని కాపాడే వర్చువల్ టెక్నాలజీ..

Virtual Technology : సరిగా మాట్లాడడం, నడవడం రాక ముందే చిన్నపిల్లలు ఇప్పుడు ఎన్నో అంతుచిక్కని వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ చిన్న పిల్లలను అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి లేదా ఒక హాస్పటల్ నుండి ఇంకొక హాస్పటల్‌కు మార్చడం అంత సేఫ్ కాదు కాబట్టే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పటల్స్ ఓ ఉపయాన్ని కనుక్కున్నారు.


కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఒక వర్చువల్ టెక్నాలజీని డెవలప్ చేశారు. దీని ద్వారా ఒక ప్రాంతంలోని హాస్పటల్స్ అన్నీ ఎప్పుడు కనెక్టెడ్‌గా ఉండవచ్చు. ఒక ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన పిల్లలను ట్రీట్ చేయడానికి అక్కడ స్పెషలిస్ట్ లేకపోతే వర్చువల్ టెక్నాలజీ ద్వారా వేరే ఆసుపత్రిలో ఉండే డాక్టర్ తనకు ట్రీట్మెంట్‌ను అందించేలాగా సౌలభ్యం అందించారు.

తాజాగా యూకేలోని కోలకెస్టర్ హాస్పిటల్‌లో ఓ పాపకు ఇలాంటి వైద్యం అందించి తన ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు వైద్యులు. అసలైతే పాప వైద్యం కోసం తనను కేంబ్రిడ్జ్‌కు తరలించాల్సి ఉన్నా.. తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యాడెన్‌బ్రూక్స్ వైద్యులు తనకు వర్చువల్‌గా చికిత్సనందించారు. దీని ద్వారా తన పాప మళ్లీ నార్మల్ అయ్యిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీకి ‘లోకాంట్స్’ అనే పేరు పెట్టారు. ఇందులో ఇతర హాస్పటల్‌లో ఉన్న పిల్లలను గమనించడానికి కేంబ్రిడ్జ్ వారికి పూర్తి యాక్సెస్ ఉంటుంది. వారు వర్చువల్‌గానే పిల్లల స్కానింగ్ రిపోర్టులు, ఎక్స్‌రేలు, వెంటిలేటర్ రీడింగ్స్‌ను గమనించవచ్చు. 2017 నుండి ఈ టెక్నాలజీ డెవలెప్మెంట్‌లో ఉందని వైద్యులు తెలిపారు. ఒకే ప్రాంతంలోని పీడియాట్రీషియన్స్‌ అందరికీ కెమెరాలకు యాక్సెస్ ఉంటుంది. దీని ద్వారా వారు పిల్లలకు చేసే కష్టమైన చికిత్సలో కూడా కలిసి నిర్ణయాలు తీసుకోవచ్చు.

లోకాంట్స్ ఐడియాను డెవలెప్ చేయడానికి చాలా ఏళ్లు గడిచినా.. ఖచ్చితంగా ఇది పిల్లల ప్రాణాలను కాపాడుతుందని వైద్యులు హామీ ఇస్తున్నారు. 16 ఏళ్లు వయసు వరకు పిల్లలను ఇలా వర్చువల్‌గా ట్రీట్ చేయవచ్చని వారు తెలిపారు. ప్రతి బేబి దగ్గర ఫిక్స్ చేసిన కెమెరా కేంబ్రిడ్జ్‌లో లైవ్‌గా కనిపిస్తుంది. దీంతో వైద్యులు హాస్పటల్‌లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా పిల్లలను గమనిస్తూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లల ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే వారిని ఒక క్రిటికల్ కేర్ యూనిట్‌లో యాడెన్‌బ్రూక్స్‌కు తరలించేలాగా ఏర్పాట్లు కూడా చేశారు. అంతే కాకుండా లోకాంట్స్‌ను మరింతగా డెవలప్ చేయాలని అనుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

Follow this link for more updates:- Bigtv

Related News

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Moto G67 Power: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

Free ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Big Stories

×