BigTV English

Eye-tracking technology : కళ్ల కదలికలను ట్రాక్ చేసే టెక్నాలజీ..

Eye-tracking technology : కళ్ల కదలికలను ట్రాక్ చేసే టెక్నాలజీ..

Eye-tracking technology : మాట్లాడకపోయినా మనసులోని మాటలను బయటపెట్టడం, కళ్ల కదలికలను బట్టి ఆలోచనలను చెప్పేయడం.. ఇలాంటి చాలా విషయాల్లో టెక్నాలజీని మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఇలాంటి ఓ కొత్త రకమైన టెక్నాలజీ మనుషులను పలకరించడానికి వచ్చేసింది.


ఒక అక్వేరియం ఎదురుగా నిలబడినప్పుడు మనిషి కళ్ల కదలికలను బట్టి తను ఏ చేపను చూస్తున్నాడో దాని పూర్తి వివరాలు కళ్ల ముందు కనిపించేలా టెక్నాలజీ ఏర్పాటయ్యింది. ఈ అక్వేరియంలలో కృత్రిమ మేధస్సును (ఏఐ) ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమయ్యింది. అక్వేరియంకు ఫిక్స్ చేసిన కెమెరాలు ముందుగా కళ్ల కదలికలను, ఆ తర్వాత చేపలను గమనిస్తాయి. ఆ తర్వాత మన కళ్లు ఏ చేప మీద పడుతుందో దాని వివరాలను చూపిస్తాయి.

అక్వేరియంతో మొదలైన ఈ ఐ ట్రాకింగ్ టెక్నిక్ టెక్నికల్ ప్రపంచంలో ఓ గేమ్ ఛేంజర్‌గా మారనుంది. అందుకే దీనికి ఏఐ అక్వేరియం అని పేరుపెట్టారు. తైవాన్‌లో ఈ ఏఐ అక్వేరియం ఆలోచనను పలు పరిశోధనల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ టెక్నాలజీ ద్వారా దాదాపు 98 శాతం వరకు చేపల వివరాలు కరెక్ట్‌గా వస్తాయని పరిశోధకులు అంటున్నారు.


ఏఐ అక్వేరియంలో మొత్తం రెండు కెమెరాలు అమర్చి ఉంటాయి. ఒక 3డీ కెమెరా ట్యాంక్‌పై అమర్చి ఉంటుంది. ఇది మనుషులు కళ్ల కదలికలను ట్రాక్ చేస్తుంది. ఇక రెండో కెమెరా చేపలపై దృష్టిపెట్టి ఉంటుంది. ఇందులోని డేటాబేస్‌లోనే అన్ని చేపల వివరాలు ఉంటాయి. కేవలం కళ్ల కదలికలనే కాదు చేతి కదలికలను కూడా కెమెరాలు గుర్తించగలవని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏఐ అక్వేరియం తైవాన్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ మెరైన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పొందుపరిచి ఉంది.

Follow this link for more updates:- Bigtv

Related News

OnePlus Phone: బాస్.. ఈ ఫోన్ చూస్తే షాక్ అవుతారు.. OnePlus 13T ఫీచర్స్ మ్యాక్స్ హైపర్!

Motorola phone: కెమెరా బాస్ మళ్లీ వచ్చేసింది.. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా

Flipkart Festive Dhamaka: మళ్లీ పండుగ సేల్ ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. 5 రోజులు మాత్రమే.. త్వరపడండి

Smartphone Comparison: రెడ్మీ 15 5జీ vs వివో Y31 5జీ vs గెలాక్సీ M36 – ఏది కొనాలి?

Tata Sumo 2025: లెజెండరీ టాటా సుమో రీఎంట్రీ.. 2025 మోడల్‌లో ఏం కొత్తగా వచ్చాయో తెలుసా?

Apple Watch Life save: సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదం.. యువకుడి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్!

Oracle Scam Warning: గూగుల్ వార్నింగ్.. ఐటి ఉద్యోగులను టార్గెట్ చేస్తున్న సైబర్ దొంగలు

Redmi Smartphone: DSLRకే సవాల్ విసిరిన రెడ్మీ!.. 200MP కెమెరా, 8K వీడియో రికార్డింగ్

Big Stories

×