EPAPER

Chollangi Amavasya:- చొల్లంగి అమావాస్య తిథికి ఆ పేరు ఎలా వచ్చింది.

Chollangi Amavasya:- చొల్లంగి అమావాస్య తిథికి ఆ పేరు ఎలా వచ్చింది.

Chollangi Amavasya:- పుష్య మాసంలో చివరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఒక తిథికి ఒక ప్రాంతం పేరుతో ముడిపెట్టి ఉత్సవాహం నిర్వహించుకోవడం ఈ ఒక్క తిథిలోనే జరుగుతుంది. కాకినాడకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చొల్లంగి గ్రామం.గోదావరి సముద్రంలో కలిసే సమయంలో ఏడుపాయలుగా విడిపోయింది. ఆ ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.


ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. జీవనది గోదావరి, సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి, పితృ తర్పణం చేయడం వల్ల 21తరాల వారు నరక లోక యాతనల నుండి విముక్తులు కాగలరని పురాణ కథనాలు చెబున్నాయి.
అందుకే చొల్లంగి అమావాస్య అని పేరు వచ్చింది.

చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య కూడా అంటారు. ఈరోజు మునులు, యోగులు , శాస్త్రం తెలిసిన వారు తమ ఇష్టమైన దైవాలను తమదైన సాధన మార్గాల్లో జపిస్తారు. స్త్రోత్రం చేస్తూ రోజంతా గడుపుతారు. ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటారు. మంత్రాన్ని అనుస్థానం చేస్తారు. అందుకే చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. సంతాన ప్రాప్తిని కోరుకునే వారు చొల్లంగిలోని ఆంజనేయస్వామిని ప్రార్థించి దీక్షను చేపడుతూ ఉఁటారు. చొల్లంగితో మొదలుపెట్టి అంతర్వేది వరకు గోదావరి సంచార యాత్ర చేస్తూ ఆలయాలను సందర్శించుకుంటూ సప్తసంగమ యాత్ర చేస్తుంటారు. ఆ యాత్ర కూడా చొల్లంగి నుంచే ప్రారంభమవడం సంప్రదాయంగా వస్తోంది.


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×