BigTV English

APSRTC Offer:- శ్రీశైలం వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

APSRTC Offer:- శ్రీశైలం వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

APSRTC Offer:- శ్రీశైలంలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. శ్రీశైలం వెళ్లే యాత్రికులు బస్సు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే స్పర్శదర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులో ఉన్న విధంగానే శ్రీశైలం విషయంలోనూ అమలు చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఏపీలో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం వివిధ ప్యాకేజీలు తీసుకొస్తామన్నారు. బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులో ఉంచినట్లే శ్రీశైలం విషయంలోనూ ఈ విధానాన్ని తెస్తున్నామని అధికారులు ప్రకటించారు.. పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఇకపై వివిధ ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులకు రాత్రి వేళల్లో వసతి కల్పించడంతో పాటు టూరిస్ట్‌ గైడ్‌లనూ అందుబాటులో ఉంచుతామని వివరించారు


శ్రీశైలలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు శ్రీశైల పురవీధులలో నందివాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించికుని ఆదివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థానం అధికారులు చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించి దేవస్థానం తరపున పంచ, కండువ, మహిళలకు చీర, రవిక వస్త్రం అందజేశారు.

Follow this link for more updates:- Bigtv


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×