Big Stories

Viral Video: ఛీఛీ ఇదెక్కడి విచిత్రం.. పబ్లిక్ టాయిలెట్స్ బయట టైమర్‌..!

Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, పెళ్లి వీడియోలు, కొన్ని ఉద్రిక్త ఘటనలకు సంబంధించినవి ఇలా రకరకాల వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే కొన్ని సార్లు సోషల్ మీడియాలో చూసే వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా చైనాకు చెందిన వారి వీడియోలు చూస్తే వారి జీవనశైలి అద్భుతం అనిపిస్తుంది. నిజంగా మనక్కుడా అలాంటి జీవనశైలి ఉంటే బాగుండేది అని కూడా చాలా మంది భావిస్తుంటారు. తరచూ వినూత్నంగా తమ జీవనశైలిని మార్చుకుంటున్న చైనీయులు తాజాగా చేసిన ఓ పనికి నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

బాత్రూంలు అందరికంటే పరిశుభ్రంగా ఉంచుకోవడంలో చైనీయులు ముందుంటారు. ఎందుకంటే తరచూ సోషల్ మీడియాలో చూసే వారి వీడియోల్లో వారి పరిశుభ్రత ఏంటో తెలుస్తుంది. అయితే ఇవి కేవలం వీడియోల కోసమే చేసినా కూడా చూడడానికి మాత్రం నిజమనే అనిపించేలా ఉంటాయి. అయితే ఈ వీడియోల్లో తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లుకొడుతుంది. చైనాలోని పబ్లిక్ టాయిలెట్లలో టైమర్ అమర్చడం నెట్టింట చర్చకు దారి తీసింది. షాంగ్సీ ప్రావిన్స్‌లోని యుంగాంగ్ బౌద్ధ గ్రోటోస్ ఒక పురాతన బౌద్ధ దేవాలయం వద్ద గల పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్లను అమర్చింది.

- Advertisement -

అవసరమైన దానికంటే ఎక్కువ సేపు బాత్రూంలలో గడపుతున్నారని, అందువల్ల టైమర్లను ఏర్పాటు చేసినట్లు అక్కడి ఉద్యోగులు వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News