Big Stories

Viral Video: ఓవైపు మండుతున్న ఎండలు.. ఇసుక ఎడారిలో పాపడ్ కాల్చిన జవాన్.. వీడియో వైరల్

Viral Video: ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతీ రోజూ 45 నుంచి 47 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా రాజస్థాన్‌లోని బికనీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఓ జవాన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ మండుతున్న ఎండల గురించి కేవలం ఒక్క వీడియోలో వివరించాడు.

- Advertisement -

వైరల్ అవుతున్న వీడియోలో ఓ జవాన్ ఇసు ఎడారిలో ఉన్నాడు. తన చేతిలో ఓ పాపడ్ తీసుకున్నాడు. అనంతరం దానిని ఆ ఎడారిలో ఇసుకలో పెట్టి కొన్ని సెకన్ల పాటు ఉంచి వేచి చూశాడు. అనంతరం ఆ పాపడ్ వేడెక్కి, కరకరలాడేలా తయారైంది. దీంతో దానిని తీసి విరిచి చూపించాడు. ప్రస్తుతం బికనీర్ లో 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ విభాగం ప్రకారం, బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 46.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

- Advertisement -

రానున్న మూడు రోజుల పాటు అల్వార్, భరత్‌పూర్, దౌసా, ధోల్‌పూర్, జైపూర్, ఝుంఝును, కరౌలి, సికర్, బార్మర్, బికనేర్, చురు, హనుమాన్‌ఘర్, జైసల్మేర్, జోధ్‌పూర్, నాగౌర్, గంగానగర్‌లలో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. కాగా, వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమే అని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News