Big Stories

Rain Water Harvesting: వర్షపు నీరు వృధా కావద్దని అపార్ట్మెంట్ వాసులు చేసిన పని వైరల్ అవుతోంది

Rain Water Harvesting: ఎండాకాలం అయిపోవడానికి సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మోస్తరు నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రస్తుతం జన నివాసాల్లోను వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే మారుతున్న సమాజంతో పాటు మనుషులు కూడా పరుగులు పెడుతున్నారు. దీంతో పట్టణాల్లో చెట్లు నరికేస్తూ బంగ్లాలు కడుతున్నారు. అయితే ఈ తరుణంలో భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. దీంతో ఎండాకాలం వస్తే విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇటీవల వేసవికాలంలో బెంగుళూరులో నీటి కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని పలు చోట్ల చాలా మంది ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఇంకిపోతున్న భూగర్భజలాలను రక్షించేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా ఓ నగరంలోని కాలనీ వాసులు చేసిన పని అందరికి ఆదర్శంగా మారింది. తమ అపార్ట్మెంట్లో నీటి కొరత ఏర్పడకుండా ఉండాలని, భూగర్భజలాలను రక్షించాలనే ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం సర్వత్రా వారిపై ప్రశంసల వర్షం కురిపించేలా చేసింది. అయితే అసలు ఆ కాలనీ వాసులు చేసిన పని ఏంటి. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

బెంగుళూరులో ఇటీవల ఏర్పడి నీటి కొరత కారణంగా దొమ్మలూరుకు చెందిన కొంతమంది అపార్ట్మెంట్ వాసులు భూగర్భజలాలను రక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలంలో నీటిని పునరుద్ధరించడం కోసం చేసే రెయిన్ వాటర్ హార్మెస్టింగ్ సిస్టమ్‌ను ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ తరుణంలో దీనికోసం ఏకంగా ఓ పెద్ద బావినే నిర్మించారు. వర్షపు నీటిని ఉపయోగించుకునే విధంగా ఓ రీఛార్జ్ వెల్ ను నిర్మించారు. దీంతో అపార్ట్మెంట్ పైన , అపార్ట్మెంట్ లోపలి సెల్లార్ లో పడే వర్షపు నీరును ఈ బావిలోకి పడేలా ఏర్పాటు చేశారు. దీంతో చాలా వరకు భూగర్భజలాలను కాపాడుకోవచ్చనే ఆలోచనతో ఈ పనిచేసినట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వీరిని ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఇలాంటి పనులు చేసేందుకు ముందుకు రావాలని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News