Big Stories

Viral Video: ఇంట్లో దూరిన దొంగ.. పట్టుకుని దాడి చేసిన యజమాని..

Viral Video: దొంగలు సరికొత్త రకాలుగా దొంగతనం చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. చాలా సార్లు వారు చేసే ప్లాన్ సక్సెస్ అయినా కొన్ని సందర్భాల్లో దొరికిపోతారు. తాజాగా చికాగోలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అయితే ఆ ఇంటి యజమాని ఏమాత్రం బెదరకుండా పట్టుకోవడమే కాకుండా బాణలితో కొట్టి దౌర్భాగ్యం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

- Advertisement -

దొంగను దారుణంగా కొట్టారు

- Advertisement -

ఇంటి యజమాని విలియమ్స్ ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా తన ఇంట్లోకి ఎవరో ప్రవేశించారని తన మొబైల్‌లో అలర్ట్ వచ్చింది. అప్పుడు వెంటనే ఇంటికి చేరుకోగా ఇంటి డోరు ఓపెన్ చేసి కనిపించింది. దీంతో వెంటనే ఇంట్లోని వంట గదిలోకి వెళ్లాడు. ఈ తరుణంలో వంట గదిలోని ఫ్రై పాన్ తీసుకుని దొంగని వెంబడించడం మొదలుపెట్టాడు. కొడతాడేమోనన్న భయంతో దొంగ ఇంట్లో నుంచి పరుగెత్తడం మొదలుపెట్టాడు. కానీ విలియమ్స్ పట్టుకుని తలపై రెండు సార్లు కొట్టాడు. దొంగకి ఏమీ అర్థంకాక గేటు దగ్గరికి పరిగెత్తాడు. కానీ విలియమ్స్ కూడా దొంగ వెంట పరుగులు తీశాడు. ఇంటి గేటు దగ్గర దొంగను మరోసారి కొట్టాడు. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందించారు.

రోడ్డుపై కనిపించిన పోలీసు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి దొంగను పట్టుకున్నాడు. ఈ దృశ్యం మొత్తం సీసీటీవీలో రికార్డయింది. చికాగో పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ వీడియోను జాసన్ విలియమ్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News