Big Stories

Kanpur mayor: అధికారిపై ఫైల్‌ విసిరేసిన మహిళా మేయర్.. వీడియో వైరల్

Kanpur mayor throws file at officer: ఆమె ఓ ప్రముఖ నగరానికి చెందిన మేయర్. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు సమస్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తావంటూ ఆమె సదరు అధికారిపై ఫైల్ ను విసిరేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఆ అధికారి మేయర్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇందుకు సంబంధించి పలు జాతీయ మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు ప్రమీలా పాండే. ఈమె ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన నగర మేయర్. కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైన్ క్లీనింగ్, ఇతర సమస్యలపై అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో ఆమె ఓ అధికారిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. అతడిపై ఫైల్ విసిరేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ అతడిపై సీరియస్ అయ్యారు. అయితే, శుభ్రపరిచే సమీక్షకు సంబంధించి ఆమెను ఓ అధికారి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో మేయర్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: అమిత్ షా వార్నింగ్.. ప్రాధాన్యత సంతరించుకున్న అన్నామలై-తమిళిసై భేటీ..

సదరు అధికారి.. ఇంజనీర్ అని, అతను తన మండలంలో మార్చిలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ‘ఇదే విషయంలో మేయర్ ను ఆ అధికారి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.. మేలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినప్పుడు, జోనల్ ఇంజనీర్ మార్చిలో పని ప్రారంభించినట్లు ఎలా చెబుతారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టినంత పనిచోయబోయారు. చేతిలోని ఫైల్ ను సదరు అధికారిపై విసిరేశారు’ అంటూ అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News